T20 World Cup Records:అమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదికలుగా టీ20 వరల్డ్‌కప్ మరో 2 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్లో 20 జట్లు పాల్గొనునున్నాయి. 2007లో ప్రారంభమైన టీ20 వరల్డ్‌కప్ టోర్నీ 8 సీజన్లు ముగించుకొని 9వ ఎడిషన్‌కు రెడీ అవుతోంది. గత 8 ఎడిషన్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్‌ను ఎంతగానో అలరించింది. ఈ పొట్టి ఫార్మాట్ టోర్నీలో అనేక రికార్డులు నమోదయ్యాయి. మరి గత 8 సీజన్లలో నమోదైన రికార్డులపై ఓ లుక్కేద్దాం.
అత్యధికసార్లు టైటిల్ విజేత
- ఇంగ్లాండ్ (2)- 2010, 2022
- వెస్టిండీస్ (2)- 2012, 2016
- భారత్ (1)- 2007
- పాకిస్థాన్ (1)- 2009
- శ్రీలంక (1)- 2014
- ఆస్ట్రేలియా (1)- 2021
అత్యధిక విజయాలు
- శ్రీలంక - 31 (51 మ్యాచ్‌ల్లో)
- పాకిస్థాన్- 28 (47 మ్యాచ్‌ల్లో)
- భారత్- 27 (44 మ్యాచ్‌ల్లో)
అత్యధిక స్కోర్లు
- శ్రీలంక- 260-6 vs కెన్యా (2007)
- ఇంగ్లాండ్- 230-8 vs సౌతాఫ్రికా (2016)
- సౌతాఫ్రికా- 229-4 vs ఇంగ్లాండ్ (2016)
అత్యల్ప స్కోర్లు
- నెదర్లాండ్స్- 39- 10 vs శ్రీలంక (2014)
- నెదర్లాండ్స్- 44- 10 vs శ్రీలంక (2021)
- వెస్టిండీస్- 55- 10 vs ఇంగ్లాండ్ (2021)
అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు
- రోహిత్ శర్మ (భారత్)- 39 మ్యాచ్‌లు
- షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)- 36 మ్యాచ్‌లు
- తిలకరత్నె దిల్షాన్ (శ్రీలంక)- 35 మ్యాచ్‌లు
టాప్ రన్ స్కోరర్లు
- విరాట్ కోహ్లీ- 1141 పరుగులు
- మహేల జయవర్దనే- 1016 పరుగులు
- క్రిస్ గేల్- 965 పరుగులు
- రోహిత్ శర్మ- 963 పరుగులు