తెలంగాణ

telangana

నా వల్లే నాన్నపై విమర్శలు- ఇప్పుడు ఫోన్ చేసి మరీ ప్రశంసలు: నితీశ్ రెడ్డి - Nitish Kumar Reddy

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 1:58 PM IST

Nitish Kumar Reddy: ఐపీఎల్ అనేక మంది యంగ్ టాలెంటెడ్ కుర్రాళ్లను కొంతకాలంగా ప్రపంచానికి పరిచయం చేస్తోంది. 2024 సీజన్​లో అలా వెలుగులోకి వచ్చిన ప్లేయరే సన్​రైజర్స్​ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి. అయితే కెరీర్​లో సక్సెస్​ అయ్యేందుకు తన తండ్రి ఎంతో ప్రోత్సహించారని నితీశ్ తాజాగా గుర్తుచేసుకున్నాడు.

Nitish Kumar Reddy
Nitish Kumar Reddy (Source: Getty Images)

Nitish Kumar Reddy:2024 ఐపీఎల్​లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టి, తక్కువ కాలంలోనే టీమ్ఇండియా పిలుపు అందుకున్నాడు సన్​రైజర్స్​ యంగ్ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి. అయితే తన కెరీర్​ను మార్చింది ఐపీఎలే అని చెప్పిన నితీశ్, లైఫ్​లో అతడి తండ్రి చాలా సపోర్ట్​గా నిలిచారని గుర్తుచేసుకున్నాడు. తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానెల్​తో మాట్లాడిన నితీశ్, తన కెరీర్​ కోసం అతడి తండ్రి ఎంత కష్టపడింది చెప్పుకొచ్చాడు. తనకు మద్దతుగా నిలుస్తున్న అతడి తండ్రిని కొందరు విమర్శించేవారని, ఇప్పుడు వాళ్లే తమను డిన్నర్​కు ఆహ్వానిస్తున్నారని అన్నాడు.

'మా నాన్న నాకు సపోర్ట్​గా నిలిచినందుకు ఆయనను అప్పట్లో చాలా మంది విమర్శించేవారు. అలా ఆయనను విమర్శించిన వారే ఇప్పుడు మా నాన్నకు ఫోన్ చేసి నన్ను మెచ్చుకుంటున్నారు. మా ఇద్దరినీ డిన్నర్​కు కూడా ఆహ్వానిస్తున్నారు. ఈ సక్సెస్ మీరంతా చూస్తున్నారు. ఈ సక్సెస్ వల్ల మా నాన్న కూడా ఆయన కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందుతున్నారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది' అని నితీశ్ అన్నాడు.

మా నాన్న ఏడ్చేశారు!తాను తొలిసారి టీమ్ఇండియా పిలుపు అందుకోవడంతో తన తండ్రి భావోద్వేగానికి గురయ్యారని నితీశ్ అన్నాడు. 'జింబాబ్వే పర్యటనకు ఎంపికవ్వగానే మా నాన్నకు ఫోన్ చేసి చెప్పాను. అంతే ఆయన ఆనందంలో బాగా ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. మా అమ్మ కూడా సంతోషించింది. కానీ, గాయం కారణంగా నేను అక్కడికి వెళ్లలేకపోయాను. ఇవన్నీ అథ్లెట్ల జీవితంలో ఓ భాగమే. జరిగిందేదో జరిగిపోయింది. జరిగిందాన్ని మనం మార్చలేం కదా. నేను ఇక్కడితో ఆగిపోను. ముందు ముందు చాలా మ్యాచ్​లు ఉన్నాయి. వాటిపైనే నా ఫోకస్ ఉంటుంది' అని అన్నాడు.

కొడుకు కోసం రాజీనామా: నితీశ్ తండ్రి ముత్యాల రెడ్డి కొడుకు కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. నితీశ్​ 8ఏళ్ల వయసు నుంచి క్రికెట్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. తను ప్రాక్టీస్ ప్రారంభించిన కొద్ది రోజులుకే ముత్యాల రెడ్డికి రాజస్థాన్ ట్రాన్స్​ఫర్ అయ్యిందట. అయితే తన కొడుకు భవిష్యత్ కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి నితీశ్​కు అండగా నిలిచారట.

కాగా, జింబాబ్వే పర్యటనకు ఎంపికయ్యాడు. కానీ, గాయం కారణంగా నితీశ్ ఈ పర్యటనకు దూరంగా ఉన్నాడు. తన స్థానంలో సెలక్టర్లు శివమ్ దూబేను ఎంపిక చేశారు.

కోహ్లీ అలా చేయడం చాలా మోటివేట్‌ చేసింది : సన్​రైజర్స్ స్టార్​ - Kohli Nitish Reddy

కెప్టెన్​గా గిల్- నితీశ్ రెడ్డి, రియాన్​కు ఫస్ట్ ఛాన్స్- జింబాబ్వే ​టూర్​కు టీమ్ అనౌన్స్​ - India Tour Of Zimbabwe 2024

ABOUT THE AUTHOR

...view details