SRH vs KKR IPL Final 2024: 2024 ఐపీఎల్ ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్- కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆదివారం తలపడనున్నాయి. లీగ్ స్టేజ్‌తోపాటు ప్లేఆఫ్స్‌లోనూ రాణించిన రెండు అత్యుత్తమ జట్ల మధ్యే టైటిల్ పోరు జరగనుంది. అయితే సన్‌రైజర్స్ బ్యాటింగ్‌లో టాపార్డర్ (హెడ్, అభిషేక్, క్లాసెన్)పై ఎక్కువగా ఆధారపడింది. క్వాలిఫయర్- 1లో ఇది స్పష్టమైంది. ఇక లీగ్ స్టేజ్ ఆఖరి మ్యాచ్‌లో పంజాబ్ పై కూడా దాదాపు ఈ పరిస్థితే ఎదురైంది. ఈ మ్యాచ్‌లో హెడ్ డకౌటైనా, అభిషేక్ ఆదుకోవడం వల్ల గట్టెక్కింది.
ఇక ఆదివారం ఆడనున్నది ఫైనల్ మ్యాచ్. టైటిల్ ముద్దాడాలంటే తప్పక నెగ్గాల్సిందే. ఈ క్రమంలో సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌ను కేకేఆర్ స్పిన్ బౌలింగ్ కాస్త కలవరపెడుతుంది. ఇరుజట్లు బ్యాటింగ్‌లో సమజ్జీవులుగా ఉన్నా, బౌలింగ్‌లో చూస్తే, సన్‌రైజర్స్ కంటే కోల్‌కతా కాస్త బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. పైగా ఫైనల్‌కు ఆతిథ్యమివ్వనున్న చెన్నై చెపాక్ స్టేడియం స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఇది కేకేఆర్‌కు బాగా కలిసొచ్చే అంశంగా మారనుంది.
కేకేఆర్ స్పిన్ ద్వయం వరుణ్ చక్రవర్తి (20)- సునీల్ నరైన్ (16) ఇద్దరూ కలిసి 36 వికెట్లు పడగొట్టారు. ఈ సీజన్లో వీరిద్దరూ కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషించారనే దానికి ఇదే ఉదాహరణ. ఇక రీసెంట్గా అహ్మదాబాద్‌లో జరిగిన క్వాలిఫయర్- 1లో నరైన్ కాస్త ఎక్కువ పరుగులిచ్చినా, వరుణ్ పొదుపుగా బౌలింగ్ చేసి 2 వికెట్లు దక్కించుకున్నాడు. దీంతో సన్‌రైజర్స్ టాపార్డన్‌ను దెబ్బకొట్టేందుకు కేకేఆర్ స్పిన్ అస్త్రాన్ని కచ్చితంగా ఉపయోగిస్తుంది. ఇక సన్‌రైజర్స్ బ్యాటర్లు స్పిన్ బౌలింగ్‌లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ఓ ప్రణాళిక ప్రకారం స్పిన్నర్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.