తెలంగాణ

telangana

ETV Bharat / sports

మెస్సీ, రొనాల్డోను అధిగమించిన యంగ్ ప్లేయర్! - బెస్ట్​ ఫుట్​బాలర్​గా ప్రతిష్టాత్మక అవార్డు! - BALLON D OR 2024 WINNER

స్పెయిన్ ఫుట్​బాల్‌ ప్లేయర్ రోడ్రీకి అరుదైన గౌరవం- ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు 'బాలన్‌ డి ఓర్‌' అవార్డు!

Ballon d Or 2024 Winner
Ballon d Or 2024 Winner (Associated Press)

By ETV Bharat Sports Team

Published : Oct 29, 2024, 12:06 PM IST

Ballon d Or 2024 Winner : స్పెయిన్ ఫుట్ బాల్ స్టార్, మాంచెస్టర్ సిటీ మిడ్‌ ఫీల్డర్ రోడ్రీ తాజాగా ఓ అరుదైన అవార్డును పొందాడు. ఫుట్​బాల్‌ లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఏటా ఇచ్చే ప్రతిష్ఠాత్మక 'బాలన్‌ డి ఓర్‌' అవార్డును అతడు దక్కించుకున్నాడు. అయితే 28 ఏళ్ల రోడ్రీ రియల్ ఈ అవార్డును పొందేందుకు మాడ్రిడ్​కు చెందిన వినిసియస్ జూనియర్, జూడ్ బెల్లింగ్‌ హామ్ వంటి బలమైన పోటీదారులను వెనక్కినెట్టడం విశేషం.

జట్టు విజయాల్లో కీలక పాత్ర
గత సీజన్​లో మాంచెస్టర్ సిటీ వరుసగా నాలుగో టైటిల్ విన్నర్​గా నిలవడంలో రోడ్రీ కీలక పాత్ర పోషించాడు. అలాగే ఈ ఏడాది యూరోపియన్ ఛాంపియన్​ షిప్​లో అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. స్పెయిన్ కు నాలుగో టైటిల్ ను అందించడంలో తీవ్రంగా కష్టపడ్డాడు. దీంతో రోడ్రీకి ఈ ఏడాది 'బాలన్‌ డి ఓర్‌' అవార్డు దక్కింది. 1990లో లోథర్ మాథౌస్ తర్వాత ఈ అవార్డును అందుకున్న మొట్టమొదటి డిఫెన్సివ్ మిడ్‌ ఫీల్డర్‌ గా రోడ్రీ నిలిచాడు. అలాగే, ఆల్ఫ్రెడో డి స్టెఫానో (1957, 1959), లూయిస్ సురెజ్ (1960) తర్వాత ఈ అవార్డును పొందిన మూడో స్పానిష్ ఫుట్‌ బాల్ క్రీడాకారుడిగా నిలిచాడు. కాగా, 2003 తర్వాత 'బాలన్‌ డి ఓర్‌' అవార్డు నామినీల జాబితాలో లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో పేర్లు లేకపోవడం ఇదే తొలిసారి.

'ఇది అందరి విజయం'
"ఈ విజయం నా ఒక్కడిదే కాదు. ఇది స్పానిష్ ఫుట్​బాల్ జట్టుది. అలాగే ఇనియెస్టా, జావి, ఇకర్ , సెర్గియో బుస్కెట్స్ వంటి చాలా మంది ఫుట్​బాల్ దిగ్గజాలది." అని అవార్డు అందుకున్న సందర్భంగా రోడ్రీ వ్యాఖ్యానించాడు.

అలాగే స్పెయిన్ ఫుట్​బాలర్, రోడ్రీ సహచరుడు లెమిన్ యమల్ అండర్-21 ఉత్తమ క్రీడాకారుడిగా కోపా ట్రోఫీని పొందాడు. అలాగే ఐతానా బొన్మతి వరుసగా రెండో ఏడాది మహిళల విభాగంలో 'బాలన్‌ డి ఓర్‌' అవార్డును దక్కించుకుంది. జెన్నిఫర్ హెర్మోసో ఫుట్‌ బాల్‌ లో మహిళల హక్కుల కోసం పోరాడినందుకు సోక్రటీస్ అవార్డును పొందింది. రియల్ మాడ్రిడ్ జట్టుకు 'పురుషుల క్లబ్ ఆఫ్ ది ఇయర్' అవార్డు దక్కగా, మేనేజర్ కార్లో అన్సెలోట్టికి 'పురుషుల కోచ్ ఆఫ్ ది ఇయర్' పురస్కారం లభించింది.

చరిత్ర సృష్టించిన రొనాల్డో- 900వ గోల్​తో వరల్డ్ రికార్డ్ - Cristiano Ronaldo 900th Goal

ఒలింపిక్స్​ టు ఫిఫా - క్రీడా రంగంలో అద్భుతమైన మెగాటోర్నీలు ఇవే!

ABOUT THE AUTHOR

...view details