ఐపీఎల్ రిటెన్షన్ షో మరికొద్ది గంటల్లో ప్రారంభమవ్వనుంది. ఈ క్రమంలో ఆయా ఫ్రాంచైజీలు కూడా తమ జట్టులో పలువురు ప్లేయర్స్‌ను అంటిపెట్టుకునేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్ మాత్రం తమ టీమ్‌లో కీలక పాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్‌ను వదులుకోవాలనుకుంటోదట. రిటైన్ చేసిన ఆటగాళ్ల తుది జాబితాను సబ్మిట్ చేసేందుకు గడువు ముగియనున్న నేపథ్యంలో ఇప్పుడీ విషయం క్రీడాభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అయ్యర్‌పై వారికి నో ఇంట్రెస్ట్!
కెప్టెన్‌గా తన మార్క్ చూపించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్‌ను కేకేఆర్ పక్కన పెట్టడం ఐపీఎల్ అభిమానులను నిరాశపరుస్తోంది. ఇప్పటి వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ మేనేజ్మెంట్ శ్రేయాస్ అయ్యర్‌ను సంప్రదించలేదని క్రీడా వర్గాల మాట. ఈ విషయం గురించి శ్రేయస్‌తో ఎటువంటి చర్చలు కూడా జరగలేదని తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే కేకేఆర్ నుంచి అతడు తప్పుకోవడం ఖాయమే అని విశ్లేషకులు అంటున్నారు.
మరోవైపు ఐపీఎల్‌లో శ్రేయస్ భవిత్వంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తోంది. ఒకవేళ కేకేఆర్ తనను అట్టిపెట్టుకోకుంటో అతడు మెగా వేలంలోకి వస్తాడని తెలుస్తోంది. మరోవైపు పలు ఫ్రాంచైజీలు కూడా ఈ స్టార్ క్రికెటర్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం.