Ruturaj Gaikwad Thala Trend :రుతురాజ్ గైక్వాడ్.. ఈ టీమ్‌ఇండియా ఆటగాడు ఇప్పుడు జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో ఆడుతున్నాడు. తాజాగా అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్ పెట్టుకున్న పోస్టు వైరల్‌గా మారింది. దానికి కారణం మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై (MS Dhoni) ఓ ట్రెండ్ సెట్ చేసినట్లు అందులో పేర్కొనడమే. ఇంతకీ ఆ ట్రెండ్ ఏంటనేది తెలియాలంటే.. ఇది చదివేయండి.
స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానులు ముద్దుగా 'తలా' అని పిలుచుకుంటారని అందరికీ తెలిసిందే. అయితే ఆయన పేరిట 'తలా ఫర్ ఏ రీజన్' అనే కోట్ సోషల్ మీడియాలో గత కొంతకాలంగా ట్రెండ్ అవుతోంది. టీమ్ఇండియా ఏ మ్యాచ్ గెలిచినా అది ధోనీకే అన్నట్లుగా ఈ కోట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఇటీవలే బార్బోడస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లోనూ సౌతాఫ్రికాపై భారత్ 7 పరుగుల తేడాతో గెలిచింది. అప్పుడు కూడా ధోనీ కోసమే అన్నట్లుగా అభిమానులు నెట్టింట ట్రెండ్ చేశారు. అయితే ఈ ట్రెండ్‌ను తానే సృష్టించానంటూ ల తాజాగా యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ వెల్లడించాడు.
భారత్ తరఫున టీ20ల్లో ఆడుతున్న రుతురాజ్ తాజాగా తన క్యాప్ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. అందులో తన క్యాప్ నంబర్ 88గా ఉంది. ఆ రెండు అంకెలను (8+8) కలిపితే 16 వస్తుందని. మళ్లీ 16ను కూడా ముందులాగే (1+6) కలిపితే 7 అవుతుందని క్యాప్షన్ జోడించాడు. 'తలా ఫర్ ఏ రీజన్' ట్రెండింగ్‌ను చేయడంలో నేను ముందున్నానంటూ చెప్పుకొచ్చాడు. ఇది చూసిన ఫ్యాన్స్ రుతును సరదాగా ఆటపట్టిస్తున్నారు. వాళ్లు కూడా తల ట్రెండ్‌ను చేస్తూ నెట్టింట సందడి చేస్తున్నారు.
ఇక ఎంతోకాలం శ్రమించిన తర్వాత టీమ్ఇండియాలో చోటు సంపాందించుకున్నాడు రుతురాజ్. ఇటీవలే జింబాబ్వే టూర్‌కు పయనమైన అతడు, మెరుగ్గానే ఆడుతున్నాడు. తొలి మ్యాచ్‌లో 7 పరుగులకే ఔటైనప్పటికీ. రెండో మ్యాచ్‌కు వేగం పుంజుకుని 77 పరుగులతో సత్తా చాటాడు. ఇక మూడో టీ20లో 49 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. మొదటి రెండు మ్యాచుల్లో వన్‌డౌన్‌లో వచ్చిన రుతు, గత పోరులో మాత్రం సెకండ్ డౌన్‌లో వచ్చి దూకుడుగా ఆడాడు.
అగ్రస్థానాన్ని కోల్పోయిన హార్దిక్ - అదరగొట్టిన గైక్వాడ్, అభిషేక్ శర్మ - ICC Latest T20 Rankings
'టాస్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నా, అయినా గెలవట్లేదు'- రుతురాజ్ గైక్వాడ్ - IPL 2024