Rohit Sharma IPL 2025 :ఐపీఎల్ మెగా వేలానికి సంబంధించిన ఊహాగానాలు క్రికెట్ అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తుంటాయి. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్‌పై వార్తలు రాగా, తాజాగా టీమ్ఇండియా సారధి రోహిత్ శర్మపై వచ్చిన ఊహాగనాలు కలకలం సృష్టిస్తున్నాయి. గత ఐపీఎల్ సీజన్‌లో రోహిత్ శర్మను ముంబయి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. దీంతో అతడు ఐపీఎల్ 2025 కంటే ముందే వేరే ఫ్రాంచైజీకి వెళ్లిపోతాడనే కథనాలూ వచ్చాయి. తాజాగా రోహిత్ వచ్చే మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకుంటాడని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనినే పంజాబ్ కింగ్స్ డైరెక్టర్ సంజయ్ బంగర్ కూడా స్పందించ వల్ల ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
పంజాబ్ కెప్టెన్‌గానేనా?
అయితే ఐపీఎల్ మెగా వేలంలో రోహిత్ శర్మ పంజాబ్ కెప్టెన్‌గా వెళ్లనున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టును విజేతగా నిలిపిన రోహిత్ శర్మ క్రేజ్ మరింత పెరిగింది. అయితే ముంబయి జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మను తొలగించి, ఆ బాధ్యతలను హార్దిక్ పాండ్యకు అప్పగించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ముంబయి ఇండియన్స్‌తో తన ప్రయాణాన్ని కొనసాగిస్తారా లేదా అనే ప్రశ్నలు చుట్టుముట్టాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఎమ్ఎస్ ధోనీకి సమానంగా రోహిత్ ఉన్నాడు. రోహిత్ నాయకత్వంలో ముంబయి జట్టు 2013, 2015, 2017, 2019, 2020లో ఐపీఎల్ టైటిళ్లను కైవసం చేసుకుంది. రోహిత్ సారథ్యంలోనే అత్యంత ఆధిపత్య ఫ్రాంచైజీగా ముంబయి తనస్థానాన్ని పదిలం చేసుకుంది. ముంబయి ఇండియన్స్‌తో రోహిత్ ప్రయాణం 2011లో ప్రారంభమైంది. 2013 సీజన్‌లో రికీ పాంటింగ్ వైదొలిగినప్పుడు అతను కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.