Rohit Sharma Helicopter:టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్తో జరగనున్న ఐదో టెస్టు వేదిక ధర్మశాలకు హాలీవుడ్ హీరో లెవెల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఆదివారం గుజరాత్ జామ్నగర్లో ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్కు హాజరైన రోహిత్, మంగళవారం హెలికాప్టర్లో ధర్మశాలకు చేరుకున్నాడు.
రోహిత్ ఎంట్రీతో స్థానికులు థ్రిల్లింగ్గా ఫీలయ్యారు. అక్కడనుంచి కెప్టెన్ వెళ్తుండగా 'రోహిత్ సర్ ఆల్ ది బెస్ట్' అంటూ ఫ్యాన్స్ విషెస్ చెప్పారు. అయితే టీమ్మేట్స్తో కలిసి రోహిత్ కూడా ఆదివారమే ధర్మశాలకు వెళ్లాల్సింది. కానీ, అంబానీ కుమారుడి ప్రీ వెడ్డింగ్ వేడుకకు వెళ్లడం వల్ల రోహిత్ మంగళవారం జట్టుతో కలిశాడు. ఇక భారత్- ఇంగ్లాండ్ మధ్య ఆఖరి టెస్టు మార్చి 07న ప్రారంభం కానుంది.
ఇక ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్ను ఒక మ్యాచ్ మిగిలుండగానే భారత్ చేజిక్కించుకుంది. హైదరాబాద్లో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఓడినప్పటికీ, తర్వాత మ్యాచ్ల్లో పుంజుకుంది. వరుసగా విశాఖపట్టణం, రాజ్కోట్, రాంచీ టెస్టుల్లో నెగ్గి హ్యాట్రిక్ కొట్టింది.