RCB VS UP Warriors WPL 2024 :ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో ఎడిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో దిల్లీ జట్టుపై ముంబయి సేన విరుచుకుపడింది. నాలుగు వికెట్ల తేడాతో తొలి మ్యాచ్‌ను బోణి కొట్టింది.ఇక శనివారం ( ఫిబ్రవరీ 24)న టోర్నీ రెండో మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ జట్లు తలపడనున్నాయి.
తొలి ఎడిషన్‌లో పేలవ ఫామ్ చూపించింది బెంగళూరు జట్టు. ఆడిన 8 మ్యాచ్‌లలో రెండింట్లో మాత్రమే విజయం సాధించింది. అలా ఓవరాల్‌గా జట్టు పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానానికి పరిమితమైంది. ఇక యూపీ వారియర్స్ కూడా గత ఎడిషన్‌లో ఆడిన 8 మ్యాచ్‌ల్లో నాలుగింటిలో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూపీ వారియర్స్ జట్టు అనూహ్య ఓటమిని చవి చూసింది.
ఈ నేపథ్యంలో రానున్న మ్యాచుల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. తీవ్ర కసరత్తులు కూడా చేస్తోంది. మరోవైపు గత ఎడిషన్‌లో ఇరు జట్లు రెండుసార్లు పోటీపడ్డాయి. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి. ఇక శనివారం జరగనున్న మ్యాచ్‌కు బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది.