RCB vs SRH IPL 2024:2024 ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. గురువారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 35 పరుగుల తేడాతో నెగ్గి, ప్రస్తుత సీజన్లో రెండో విజయం నమోదు చేసింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ప్లేఆఫ్స్‌కు రూట్ కోసం ప్రెడిక్షన్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్సీబీ విజయాన్ని కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
ఈ సీజన్లో ఆర్సీబీ 9 మ్యాచ్‌లు ఆడగా 7 మ్యాచ్‌ల్లో ఓడి, రెండింట్లో గెలిచింది. పంజాబ్‌తో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో నెగ్గగా, రీసెంట్గా సన్‌రైజర్స్‌పై 35 పరుగులతో విజయం సాధించింది. అయితే ఈ రెండు విజయాలకు మధ్య 30 రోజుల గ్యాప్ ఉంది. అంటే మార్చి 25న ఆర్సీబీ తొలి విజయం నమోదు చేయగా, ఏప్రిల్ 25న రెండోసారి గెలిచింది. దీంతో ఈ విషయంపై నెటిజన్లు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. 'ఈ లెక్కన మూడో విజయం ఎప్పుడో' అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం ఆర్సీబీ 4 పాయింట్లతో పట్టికలో చివరన (10వ స్థానం) ఉంది. ఈ సీజన్లో ఆర్సీబీ మరో 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో గుజరాత్ టైటాన్స్‌తో రెండుసార్లు, పంజాబ్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో ఒక్కోసారి తలపడాల్సి ఉంది. ఈ అన్నింట్లో గెలిస్తే అప్పుడు బెంగళూరు ఖాతాలో 7 విజయాలతో 14 పాయింట్లు ఉంటాయి. అప్పుడు రన్రేట్తోపాటు మిగతా జట్ల జయాపజయాలపై ఆర్సీబీ ప్లే ఆఫ్స్ ఛాన్స్‌లు ఆధారపడి ఉంటాయి.