తెలంగాణ

telangana

ETV Bharat / sports

పతకానికి దగ్గరలో లవ్లీనా- ప్రీ క్వార్టర్స్​కు సింధు, లక్ష్యసేన్- డే 5 హైలైట్స్ ఇవే! - Paris Olympics 2024

Paris Olympics Day 5 India: పారిస్ ఒలింపిక్స్‌లో ఇవాళ భారత్‌కు ఆశాజనక ఫలితాలు వచ్చాయి. మరి బుధవారం నాటి ఒలింపిక్స్​ హైలైట్స్​ ఇవే!

Paris Olympics Day 5
Paris Olympics Day 5 (Source: Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 10:45 PM IST

Paris Olympics Day 5 India:పారిస్ ఒలింపిక్స్​లో ఐదో రోజు భారత్​కు మంచి ఫలితాలే దక్కాయి. స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ బ్యాడ్మింటన్ సింగిల్స్​లో ప్రీ క్వార్టర్స్​కు అర్హత సాధించారు. బుధవారం జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్​లో క్రిస్టిన్‌ కూబా (ఎస్టోనియా)పై 21-5, 21-10 తేడాతో నెగ్గి రౌండ్ 16 (ప్రీ క్వార్టర్స్​)కు అర్హత సాధించింది. మ్యాచ్​లో సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడం వల్ల ఆట 34 నిమిషాల్లోనే ముగిసింది. మరోవైపు లక్ష్యసేన్‌ పురుషుల సింగిల్స్​ గ్రూప్​ స్టేజ్​లో జొనాథన్ (ఇండోనేసియా)తో తలపడ్డాడు. ఈ మ్యాచ్​లో 21-18, 21-12 తేడాతో నెగ్గి ప్రీ క్వార్టర్స్​కు వెళ్లాడు.

టేబుల్ టెన్నిస్​లో రికార్డ్ కానీ అంతలోనే
యంగ్ ప్లేయర్లు మనీకా బాత్రా, ఆకుల శ్రీజ బుధవారం రికార్డు సృష్టించారు. మహిళల సింగిల్స్​ టేబుల్ టెన్నిస్ వేర్వేరు పోటీల్లో మనీకా, శ్రీజ విజయం సాధించి ప్రీ క్వార్టర్స్​కు దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఒలింపిక్స్​ టేబుల్ టెన్నిస్​లో ప్రీ క్వార్టర్​ ఫైనల్స్​కు అర్హత సాధించిన అథ్లెట్లుగా రికార్డు సృష్టించారు. మనికా బాత్ర 4-0 తేడాతో నెగ్గగా, తెలుగు అమ్మాయి ఆకుల శ్రీజ సెర్బియన్ ప్లేయర్ జియాన్ జెంగ్​పై 4-2 తేడాతో నెగ్గింది.

అయితే టేబుల్ టెన్నిస్​లో రికార్డు సృష్టించిన మనికా బాత్ర ప్రీ క్వార్టర్స్​లో నిరాశ పర్చింది. రౌండ్ 16లో మ్యూ హిరానో (జపాన్)తో పోటీపడ్డ మనికా బాత్ర 4-1 తేడాతో ఓడింది.

ఫైనల్​కు స్వప్నిల్
పురుషుల 50మీటర్ల రైఫిల్ 3పొజిషన్స్​ ఈవెంట్లో స్వప్నిల్ కుసాలే ఫైనల్​కు దూసుకెళ్లాడు. 590-38x పాయింట్లతో క్వాలిఫైయర్​లో 7వ స్థానంలో నిలిచి పతక పోరుకు అర్హత సాధించాడు. ఆగస్టు 01న స్వప్నిల్​ ఫైనల్​లో ఆడనున్నాడు. మరోవైపు ఇదే ఈవెంట్లో షూటర్ ఐశ్వరీ ప్రతాప్ 589-33x పాయింట్లతో 11వ స్థానం దక్కించుకున్నాడు.

పతకానికి దగ్గరలో లవ్లీనా
స్టార్‌ బాక్సర్‌ లవ్లీనా బొర్గొహెయిన్‌ పతకానికి అడుగు దూరంలో నిలిచింది. మహిళల 75 కేజీల విభాగంలో రౌండ్‌ 16 మ్యాచ్‌లో విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరుకుంది. నార్వే బాక్సర్‌ సునీవాపై 5-0 తేడాతో అలవోకగా విజయం సాధించింది. ఆగస్టు 4న లి కియాన్‌ (చైనా)తో జరిగే క్వార్టర్స్‌లో లవ్లీనా గెలిస్తే భారత్‌కు మరో పతకం ఖాయమవుతుంది. కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా 69 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది.

ఆర్చరీలో దీపిక మార్క్​
దీపికా కుమారి ఆర్చరీ సింగిల్స్​ ఈవెంట్లో వరుస విజయాలు నమోదు చేసింది. మొదట రీనా పర్నత్​పై నెగ్గి రౌండ్ 32కు అర్హత సాధించింది. అనంతరం రౌండ్​ 32లో ప్రత్యర్థి క్విని రోఫిన్​పై 6-2 తేడాతో గెలిచింది. దీంతో దీపిక రౌండ్ 16కు క్వాలిఫై అయ్యింది.

క్వార్టర్స్​కు హాకీ టీమ్
భారత హాకీ టీమ్ క్వార్టర్ ఫైనల్​కు అర్హత సాధించింది. బెల్జియంపై ఆస్ట్రేలియా విజయం సాధించడం వల్ల భారత్​కు క్వార్టర్స్​ బెర్తు ఖరారైంది. కాగా, ఒలింపిక్స్​లో భారత హాకీ జట్టు ఇప్పటిదాకా 12 పతకాలు సాధించింది. మరోవైపు అన్షు అగర్వాలా ఈక్విస్ట్రియన్ (గుర్రపు స్వారీ)లో నిరాశ పర్చాడు. బుధవారం జరిగిన డ్రెస్సింగ్ ఈవెంట్​లో అన్షు విఫలమయ్యాడు.

ఈ స్టార్ షూటర్ ఒకప్పుడు​ ధోనీలాగే టికెట్ కలెక్టర్ - ఇప్పుడు పారిస్​ ఒలింపిక్స్​లో సంచలనం! - Paris Olympics 2024

లక్ష్యసేన్ రివర్స్​​ షాట్- ఈ షట్లర్ స్కిల్​కు అడియెన్స్​ ఫిదా- వీడియో వైరల్​ - Paris Olympics 2024

ABOUT THE AUTHOR

...view details