తెలంగాణ

telangana

ETV Bharat / sports

తొలి ఓవరే​ 'మెయిడెన్'- డెబ్యూలోనే మయాంక్ అరుదైన రికార్డ్ - Mayank Yadav Debut

Mayank Yadav Debut : భారత్ - బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్​లో పేసర్ మయాంక్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు.

By ETV Bharat Sports Team

Published : 5 hours ago

Mayan Yadav Debut
Etv Bharat (Source: Associated Press)

Mayank Yadav Debut :భారత్ - బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్​తో పేస్ సంచలనం మయాంక్ యాదవ్ టీమ్ఇండియా తరపున అరంగేట్రం చేశాడు. మాజీ ప్లేయర్ పార్ధివ్ పటేల్ మయాంక్​కు క్యాప్ అందజేశాడు. ఇక జాతీయ జట్టులోకి వచ్చీ రావడంతోనే మయాంక్ తనదైన స్టైల్​లో బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలో తొలి మ్యాచ్​లోనే మయాంక్ ఓ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్​లో తొలి ఓవర్​నే మెయిడెన్​గా మలిచి సత్తా చాటాడు. ఈ క్రమంలో టీ20 అరంగేట్రంలో తొలి ఓవర్​నే మెయిడెన్​గా మలిచిన భారత మూడో బౌలర్​గా నిలిచాడు. మయాంక్ కంటే ముందు ఈ ఘనత సాధించిన భారత బౌలర్లు ఎవరో తెలుసా?

ఇంటర్నేషనల్ టీ20 డెబ్యూలో తొలి ఓవర్​ మెయిడెన్ వేసిన బౌలర్లు

అజిత్ అగార్కర్ vs సౌతాఫ్రికా (2006)
టీమ్ఇండియా దిగ్గజ ప్లేయర్ అజిత్ అగార్కర్ 2006 సౌతాఫ్రికాతో మ్యాచ్​లో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. జొహెన్నస్​బర్గ్​లో జరిగిన ఈ మ్యాచ్​లో అగార్కర్ 6వ ఓవర్​ వేయడానికి బంతి అందుకున్నాడు. ఇక క్రీజులో ఉన్న హర్షెల్ గిబ్స్​ను అగార్కర్ ఓవర్ అంతా ఇబ్బంది పెట్టాడు. ఈ ఓవర్​లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దీంతో అంతర్జాతీయ టీ20 డెబ్యూలో తొలి ఓవర్​నే మెయిడెన్​గా మలిచిన భారత తొలి బౌలర్​గా రికార్డు సృష్టించాడు. కాగా, ఈ మ్యాచ్​లో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో నెగ్గింది.

అర్షదీప్ సింగ్ vs ఇంగ్లాండ్ (2022)
2022 సౌతాంప్టన్​లో ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో అర్షదీప్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్​లో రెండో ఓవర్​లోనే బౌలింగ్ వేసే అవకాశం వచ్చిన అర్షదీప్ కెరీర్​ను ఘనంగా ఆరంభించాడు. తన స్వింగ్ బంతులతో క్రీజులో ఉన్న జేసన్ రాయ్​ను బాగా ఇబ్బంది పెట్టాడు. అలా ఈ ఓవర్​లో అర్షదీప్ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు (కానీ, రెండు లెగ్​ బై సింగిల్స్​ వచ్చాయి). దీంతో ఈ ఘనత సాధించిన టీమ్ఇండియా రెండో బౌలర్​గా రికార్డు కొట్టాడు. అగార్కర్ తర్వాత దాదాపు 16ఏళ్లకు మరో బౌలర్ ఈ ఘనత సాధించాడు. ఇక ఈ మ్యాచ్​లో 3.3 ఓవర్లలో అర్షదీప్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్​పై భారత్ 50 పరుగుల తేడాతో నెగ్గింది.

కాగా, ఈ మ్యాచ్​లో మయాంక్ తన పూర్తి కోటాలో 5.20 ఎకనమీతో 21 పరుగులిచ్చి 1 వికెట్ దక్కించుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే, బంగ్లాపై భారత్ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. బంగ్లా నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని భారత్ 11.5 ఓవర్లలోనే ఛేదించింది.

హార్దిక్ పాండ్య 'నో లుక్ షాట్'- ఏమి కాన్ఫిడెన్స్ బాసు!- వీడియో వైరల్ - Hardik No Look Shot

టీమ్‌ఇండియా ఆల్‌రౌండ్‌ షో- బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో గ్రాండ్ విక్టరీ - India Vs Bangladesh T20

ABOUT THE AUTHOR

...view details