తెలంగాణ

telangana

ETV Bharat / sports

సౌథీ వరల్డ్​ రికార్డ్- పొట్టికప్​ హిస్టరీలోనే బెస్ట్ బౌలింగ్ స్పెల్! - T20 World Cup 2024

Tim Southee T20 World Cup: 2024 టీ20 వరల్డ్​కప్​లో పూర్తిగా బౌలర్ల ఆధిపత్యం నడుస్తోంది. ఈ క్రమంలో కివీస్ బౌలర్ టిమ్ సౌథీ వరల్డ్​ రికార్డు కొట్టాడు.

Southee  world cup
Southee world cup (Source: Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jun 15, 2024, 12:27 PM IST

Tim Southee T20 World Cup:2024 టీ20 వరల్డ్​కప్​లో బౌలర్ల ఆధిపత్యం నడుస్తున్న తరుణంలో న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ అరుదైన రికార్డు కొట్టాడు. టీ20 వరల్డ్​కప్​ హిస్టరీలోనే బెస్ట్ బౌలింగ్ స్పెల్​ (తక్కువ ఎకనమీ)తో బౌలింగ్ చేశాడు. 2024 టీ20 ప్రపంచకప్​లో శనివారం ఉగాండాతో జరిగిన మ్యాచ్​లో సౌథీ తన నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 4 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక మెయిడెన్ కూడా ఉంది.

ఈ క్రమంలో ఇదే టోర్నీలో ఉగాండ బౌలర్ ఫ్రాంక్ సుబుగా (4-2-4-2) నెలకొల్పిన రికార్డును, తాజా మ్యాచ్​తో సౌథీ బ్రేక్ (4-1-4-3) చేశాడు. దీంతో పొట్టి కప్​ టోర్నీలో అతి తక్కువ ఎకనమీతో బౌలింగ్ చేసిన ప్లేయర్​గా సౌథీ రికార్డు నెలకొల్పాడు. ఇక టీ20 వరల్డ్​కప్​లో తక్కువ ఎకనమీతో బౌలింగ్ చేసిన టాప్-4 ప్లేయర్లు ఎవరో తెలుసుకుందాం.

  • ట్రెంట్ బోల్డ్ (1.80 ఎకనమీ): ఇదే మ్యాచ్​లో కీవీస్ పేసర్ బోల్డ్​ కూడా అద్భుత గణాంకాలు నమోదు చేశాడు. అతడి 4 ఓవర్ల స్పెల్​లో 7 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.
  • అన్రీచ్ నోకియా (1.80 ఎకనమీ): 2024 వరల్డ్​కప్​లోనే రీసెంట్​గా శ్రీలంకతో మ్యాచ్​లో సౌతాఫ్రితా బౌలర్ నోకియా నిప్పులు చెరిగాడు. ఈ మ్యాచ్​లో నోకియా 4 ఓవర్ల కోటాలో (4-0-7-4) నమోదు చేశాడు.
  • ఫ్రాంక్ సుబుగా (1.00 ఎకనమీ):నోకియా క్రియేట్ చేసిన రికార్డును ఉంగాడ బౌలర్ సుబుగా మూడు రోజుల్లోనే బద్దలుకొట్టాడు. ఇదే టోర్నీలో న్యూగినియా మ్యాచ్​లో (4-2-4-2) గణాంకాలు నమోదు చేశాడు. కాగా, తాజా మ్యాచ్​లో సౌథీ ఈ రికార్డు బద్దలుకొట్టాడు.
  • టిమ్ సౌథీ (1.00 ఎకనమీ): ఉగాండ బౌలర్ నెలకొల్పిన రికార్డును 35ఏళ్ల సౌథీ 10 రోజుల్లోనే బద్దలుకొట్టాడు. ఉగాండతో మ్యాచ్​లో నిప్పులు చెరిగిన సౌథీ (4-1-4-3) సూపర్ స్పెల్​తో అదరగొట్టాడు.

కాగా, ఈ మ్యాచ్​లో న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఉగాండ కివీస్ బౌలర్ల ధాటికి నిలబడలేక విలవిల్లాడింది. 18.4 ఓవర్లలో 40 పరుగులకే కుప్పకూలిపోయింది. సౌథీ 3, బోల్ట్, శాంట్నర్, రచిన్ రవీంద్ర తలో 2, ఫెర్గ్యూసన్ 1 వికెట్ దక్కించుకున్నారు. అనంతరం ఛేదనలో కివీస్ 5.2 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

సూపర్‌-8కు అమెరికా - పాకిస్థాన్‌ ఔట్​ - T20 Worldcup 2024

1 పరుగు తేడాతో సౌతాఫ్రికా విజయం- ఉత్కంఠ పోరులో నేపాల్​కు నిరాశ - T20 World Cup 2024

ABOUT THE AUTHOR

...view details