తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్లేయర్లకు చిన్నారుల సెండాఫ్- కివీస్ క్రేజీ ప్లాన్- క్యూట్ వీడియో చూశారా? - T20 World Cup 2024 - T20 WORLD CUP 2024

New Zealand T20 World Cup 2024: న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మరోసారి ఫ్యాన్స్​ను ఆకట్టుకుంది. ఇటీవల ఇద్దరు చిన్నారులచే వరల్డ్​కప్​ జట్టును ప్రకటించిన కివీస్ బోర్డు, తాజాగా వారితోనే ప్లేయర్లకు సెండాఫ్ ఇప్పించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్​గా మారింది. మీరు ఆ వీడియో చూాశారా?

New Zealand T20 World Cup
New Zealand T20 World Cup (Source: ANI)

By ETV Bharat Telugu Team

Published : May 29, 2024, 8:08 AM IST

Updated : May 29, 2024, 9:55 AM IST

New Zealand T20 World Cup 2024:2024 టీ20 వరల్డ్​కప్ నేపథ్యంలో టోర్నీలో పాల్గొననున్న ఆయా జట్లు అమెరికా, వెస్టిండీస్ బయల్దేరుతున్నాయి. ఈ క్రమంలో న్యూజిలాండ్ జట్టు ప్లేయర్లు కూడా బుధవారం అమెరికా పయనమయ్యారు. అయితే కీవీస్ క్రికెట్ బోర్డు తమ ప్లేయర్లకు వినూత్నంగా సెండాఫ్ ఇచ్చి నెట్టింట ట్రెండింగ్​గా మారింది. ఇటీవల ఇద్దరు చిన్నారులచే జట్టును ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు, మళ్లీ ఆ పిల్లలతోనే ప్లేయర్లకు క్యూట్ సెండాఫ్ ఇప్పించింది.

ఎయిర్ పోర్ట్​ చెక్​ఇన్​లో ఆ చిన్నారులు (మటిల్డా, ఆంగస్) జట్టు ప్లేయర్లను ముందుగా 'హాయ్, హలో' అంటూ పలకరించారు. 'ఫ్లైట్​ ట్రావెలెంగ్​లో ఏ సినిమాలు చూస్తారు?', 'మేము మీతో రావచ్చా?' అని సరదా ప్రశ్నలు అడిగారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, బౌల్ట్, డారిల్​ మిచెల్ ​సహా పలువురితో ఆ చిన్నారులు సరదాగా కాసేపు ముచ్చటించారు. ఇక చివరికి బాయ్ గుడ్​లక్ అంటూ సెండాఫ్ ఇచ్చారు. ఈ వీడియోను న్యూజిలాండ్ బోర్డు తమ అఫీషియల్ ట్విట్టర్​లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చాలా క్యూట్​గా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ టోర్నీలో కివీస్ జూన్ 7న అఫ్గానిస్థాన్​తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.

న్యూజిలాండ్ జట్టు:కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డేవన్ కాన్వే, రచిన్ రవీంద్ర, ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైకెల్ బ్రాస్‌వెల్, మార్క్‌ చాప్‌మన్, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్‌, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి, టిమ్‌ సౌథీ.

2024 T20 World Cup: అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఈ ప్రతిష్ఠాత్మకమైన టోర్నమెంట్​కు ఆతిథ్యమివ్వనున్నాయి. ఇక టోర్నీలో 20 దేశాలు తలపడుతున్నాయి. ఈ 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి లీగ్ మ్యాచ్​లు నిర్వహించనున్నారు. యూఎస్ఏ, కెనడా, యుగానా పొట్టి ప్రపంచకప్​లో ఆడడం ఇదే తొలిసారి. జూన్​ 2 నుంచి 30 వరకు టోర్నీ జరగనుంది.

న్యూజిలాండ్ వరల్డ్​కప్ స్క్వాడ్ ఔట్- మళ్లీ కేన్ మామే కెప్టెన్​ - T20 World Cup 2024

ఆసీస్ x కివీస్: విలియమ్సన్ 12ఏళ్లలో తొలిసారి అలా

Last Updated : May 29, 2024, 9:55 AM IST

ABOUT THE AUTHOR

...view details