![ముంబయి మరో విక్టరీ- గుజరాత్‌పై విజయం WPL 2025](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-02-2025/1200-675-23571796-thumbnail-16x9-wpl.jpg)
Published : Feb 18, 2025, 10:56 PM IST
WPL 2025 MI Vs GG :మహిళల ఐపీఎల్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 121 పరుగుల లక్ష్యాన్ని 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ సీజన్‌లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బ్రంట్ (57) అర్ధశతకంతో చెలరేగింది. మాథ్యూస్ (17), అమేలియా (19) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో గౌతమ్, ప్రియ చెరో 2 వికెట్లు పడగొట్టగా తనూజ ఒక వికెట్ తీసింది. అంతకుముందు గుజరాత్ 120 పరుగులకు ఆలౌటైంది. ముంబయి బౌలర్లలో మాథ్యూస్ 3 వికెట్లు తీయగా.. బ్రంట్, అమీలియా తలో 2, సిసోదియా, ఇస్మాయిల్ చెరో వికెట్ తీశారు.