తెలంగాణ

telangana

ETV Bharat / sports

కుంబ్లే, హర్భజన్ కన్నా అతడి బౌలింగ్‌లోనే కీపింగ్‌ చేయడం కష్టం! : ధోనీ - DHONI ABOUT WICKET KEEPING

అతడి బౌలింగ్‌లో కీపింగ్‌ చేయడం కష్టమన్న మాజీ క్రికెటర్ ధోనీ.

DHONI
DHONI (source Getty Images)

By ETV Bharat Sports Team

Published : Dec 12, 2024, 7:01 AM IST

DHONI ABOUT WICKET KEEPING : భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ వికెట్‌ కీపింగ్ స్కిల్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీమ్‌ఇండియాకు టెస్ట్‌, వన్డే, టీ20ల్లో సుదీర్ఘకాలం కీపర్‌గా సేవలు అందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్నా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కీపర్‌గా కొనసాగుతున్నాడు. 43 ఏళ్ల వయసులో కూడా కళ్లుచెదిరే క్యాచ్‌లు, అద్భుతమైన స్టంపింగ్‌లతో అదరగొడుతున్నాడు.

కీపర్‌గా ధోనీకి చాలా అనుభవం ఉంది. ఎంతో మంది టాప్‌ బౌలర్‌ల బౌలింగ్‌కు కీపింగ్‌ చేశాడు. అత్యుత్తమ బౌలర్‌ల బంతులను సునాయాసంగా అందుకున్నాడు. కానీ ఓ బౌలర్‌ బౌలింగ్‌లో కీపింగ్‌ చేయడానికి మాత్రం తాను కష్టపడినట్లు ఓ సందర్భంలో తెలిపాడు మహీ. అతడు ఎవరంటే?

అతడి బౌలింగ్‌లో కీపింగ్‌ చేయడం చాలా కష్టం!

కెరీర్‌ ప్రారంభంలోనే ధోనీ భారత లెజెండరీ బౌలర్‌ల బౌలింగ్‌లో వికెట్‌ కీపింగ్‌ చేశాడు. ఆ సమయంలో అనిల్ కుంబ్లే లేదా హర్భజన్ సింగ్‌కు కీపింగ్ చేయడం కన్నా వీరేంద్ర సెహ్వాగ్ బౌలింగ్‌కు కీపింగ్ చేయడం చాలా కష్టంగా ఉండేదని చెప్పాడు.

2005 నవంబర్‌లో టెస్ట్ అరంగేట్రం చేయడానికి ముందు మహీ, 'ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్‌ఫో' ఇంటర్వ్యూలో మాట్లాడాడు. 'భారత పిచ్‌లపై హర్భజన్ వంటి బౌలర్లకు కీపింగ్‌ చేయడం కష్టమా? అని మహీని ప్రశ్నించారు. దీనికి ధోనీ సమాధానమిస్తూ, 'కాస్త కష్టమే. అనిల్ భాయ్ (కుంబ్లే), హర్భజన్ సింగ్‌ ఇద్దరికీ కీపింగ్‌ చేయడం ఛాలెంజింగ్‌గా ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా వీరూ (వీరేంద్ర సెహ్వాగ్‌) బౌలింగ్‌లో కీపింగ్‌ చేయడం నాకు మరింత కష్టం. ఎందుకు అది నన్ను అడగవద్దు (నవ్వుతూ).' అని చెప్పాడు.

కాగా, సెహ్వాగ్ తన కెరీర్ ప్రారంభంలో ముఖ్యంగా వన్డేల్లో క్రమం తప్పకుండా బౌలింగ్ చేశాడు. దిల్లీకి చెందిన సెహ్వాగ్‌ అంతర్జాతీయ వన్డేల్లో 146 మ్యాచుల్లో 96 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 91 ఇన్నింగ్స్‌లలో 40 వికెట్లు తీశాడు.

మరోవైపు ఎంఎస్‌ ధోనీ తన కెరీర్‌లో అన్ని ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. 2014లో టెస్టు క్రికెట్‌ నుంచి మహీ వైదొలిగాడు. 90 టెస్టుల్లో 256 క్యాచ్‌లు పట్టాడు, 38 స్టంపింగ్‌లు చేశాడు. అలానే 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మొత్తంగా 350 వన్డేల్లో 321 క్యాచ్‌లు అందుకున్నాడు, 121 స్టంపింగ్‌లు చేశాడు. 98 టీ20ల్లో 57 క్యాచ్‌లు పట్టాడు, 34 స్టంపింగ్‌లు చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో, మార్క్ బౌచర్ (998), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (905) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన కీపర్‌గా ధోనీ (829) నిలిచాడు.

స్మృతి మంధాన ఆల్‌టైమ్ రికార్డ్ - ఏడాదిలో నాలుగోది

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్​ - 6 ఏళ్ల తర్వాత రోహిత్ శర్మ డౌన్!, కోహ్లీ ర్యాంక్ ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details