Mohammed Siraj England Series :క్రికెట్ లవర్స్‌కు బీసీసీఐ ఓ షాకింగ్ న్యూస్ తెలిపింది. టీమ్ఇండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను జట్టును నుంచి విడుదల చేశామంటూ తాజాగా ప్రకటించింది. రెండో టెస్టు ముందు ఈ నిర్ణయాన్ని తీసుకున్నామంటూ వివరిచింది. అయితే ఒక్క టెస్టుకే సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరమేంటంటూ అభిమానులు ఆరాతీయడం మొదలెట్టారు. అసలు సిరాజ్ విషయంలో ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటూ చర్చించుకోవడం మొదలెట్టారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సుదీర్ఘమైన సిరీస్‌ను, ఇటీవలే సిరాజ్ విరామం లేకుండా ఆడటాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
''వైజాగ్ టెస్టుకు టీమ్ఇండియా జట్టు నుంచి మహ్మద్ సిరాజ్‌ను విడుదల చేస్తున్నాం. సుదీర్ఘమైన సిరీస్, అతడు ఇటీవల ఆడిన క్రికెట్‌ను దృష్టిలో పెట్టుకొని మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. రాజ్‌కోట్ వేదికగా జరగనున్న మూడో టెస్టుకు అతడు అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు అతడి స్థానంలో రెండో టెస్టుకు అవేశ్ ఖాన్ తిరిగి జట్టులోకి వచ్చాడు'' అంటూ బీసీసీఐ తాజాగా ట్వీట్ చేసింది. ఇక తొలి టెస్టులో సిరాజ్ వికెట్ సాధించని విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు ఓవర్లు ఆడిన ఈ స్టార్ ప్లేయర్, రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఏడు ఓవర్లు మాత్రమే వేశాడు.
India Playing 11 For 2nd Test : భారత్ తుది జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్.