Kane Williamson Baby :న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ తన ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్ చెప్పాడు. ఆయన ఓ పండంటి పాపకు తండ్రిగా ప్రమోట్ అయినట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తెలిపారు. ఆ పాపను ఆప్యాయంగా ఎత్తుకున్న ఫొటోను షేర్ చేశారు. తల్లిబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.
"ఇప్పుడిక ముగ్గురు. ఈ ప్రపంచంలోకి సురక్షితంగా నీ ప్రయాణం సాగినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అందమైన చిన్నారికి స్వాగతం" అంటూ ఓ స్వీట్ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఇది చూసిన ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా కేన్‌తో పాటు ఆయన సతీమణి సారా రహీంకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చిన్నారిని ఆశీర్వదిస్తున్నారు.
2015 నుంచి ప్రేమలో ఉన్న కేన్ విలియమ్సన్- సారా రహీంలు 2020లో మ్యాగీ అనే కుమార్తెకు తల్లిదండ్రులయ్యారు. ఆ తర్వాత రెండేళ్లకు సారా ఓ కుమారుడికి జన్మనిచ్చింది. అయితే ఈ జంట ఇప్పటివరకు వివాహం చేసుకోలేదు.
Kane Willamson Career : ఇక కేన్ మామ కెరీర్ విషయానిసి వస్తే - తండ్రి కానున్న సందర్భరంగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు విలియమ్సన్. ఫిబ్రవరి 29 నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు కేన్ అందుబాటులో ఉండనున్నాడు.
Kane Willamson Test Series : మరోవైపు ప్రస్తుతం కేన్ విలియమ్సన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అతడు మైదానంలో బౌండరీలు బాది శతకాలు బాది స్టేడియాన్ని ఓ మోత మోగించాడు. సెంచరీలతో ప్రత్యర్థులను హడలెత్తించాడు. తొలి టెస్టులో 118, 109 పరుగులు సాధించి రికార్డుకెక్కాడు. ఇక రెండో టెస్టులో 43, (133*) పరుగులు స్కోర్ చేసి సత్తాచాటాడు. అలా టెస్టు సెంచరీల్లో విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఓ రికార్డును విలియమ్సన్ అధిగమించాడు. అయితే కేన్ ఇప్పటివరకు 98 టెస్టుల్లో 32 సెంచరీలు, 165 వన్డేల్లో 13 శతకాలు నమోదు చేశాడు.
టెస్టుల్లో కేన్ దూకుడు - రెండు ఇన్నింగ్స్‌లో మూడు రికార్డులు
ఐసీసీ ర్యాంకింగ్స్ రిలీజ్ - కేన్ మామనే టాప్ - రోహిత్, కోహ్లీ పొజిషన్ ఏంటంటే ?