తెలంగాణ

telangana

ETV Bharat / sports

తెలుగు తేజం అరుదైన ఘనత - తన రికార్డును తానే బ్రేక్ చేసిన జ్యోతి - జ్యోతి యర్రాజీ మెడల్స్

Jyothi Yarraji Asian Indoor Athletics Championships 2024: ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్‌ జ్యోతి యర్రాజీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మహిళల 60 మీటర్ల హర్డిల్స్‌ను 8.12 సెకన్లలో పూర్తి చేసి గత ఏడాది తానే నెలకొల్పిన 8.13 సెకన్ల జాతీయ రికార్డును బ్రేక్ చేసింది.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2024, 7:00 AM IST

Jyothi Yarraji Asian Indoor Athletics Championships 2024 : భారత స్టార్‌ స్ప్రింటర్‌ జ్యోతి యర్రాజి తాజాగా ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. మహిళల 60మీ హర్డిల్స్‌లో తన పేరిటే ఉన్న ఓ జాతీయ రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో శనివారం ఆమె 8.12 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. హీట్‌లో 8.22 సెకన్ల టైమింగ్‌తో టాప్​ పొజిషన్​కు చేరుకున్న జ్యోతి ఫైనల్స్​లో జపాన్‌కు చెందిన తెరెదా (8.21సె)ను బీట్​ చేసి విజేతగా నిలిచింది. ఇక ఇదే టోర్నీలో హాంకాంగ్‌కు చెందిన లుయ్‌ లై యు 8.26 సెకన్లతో కాంస్యం సాధించింది.

ఇక 60మీ హర్డిల్స్‌లో జ్యోతి గత అత్యుత్తమ టైమింగ్‌ 8.13 సెకన్లు. 2022 ఆసియా క్రీడల్లో ఆమె 100మీ హర్డిల్స్‌ రజత పతకాన్ని సాధించింది. ఆసియా ఔట్‌ డోర్‌ 100మీ హర్డిల్స్‌లో జ్యోతి డిఫెండింగ్‌ ఛాంపియన్​గా కూడా నిలిచింది. భువనేశ్వర్‌లోని రిలయన్స్‌ ఫౌండేషన్​లో జ్యోతి ప్రస్తుతం శిక్షణ తీసుకుంటోంది.

మరోవైపు ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌లో ఇంకో రెండు స్వర్ణాలు కూడా భారత్‌ ఖాతాలో చేరాయి. పురుషుల షాట్‌పుట్‌లో తజిందర్‌పాల్‌ సింగ్‌ పసిడి పతకాన్ని సాధించాడు. తన రెండో ప్రయత్నంలోనే ఈ స్టార్ తన గుండును 19.71 మీటర్లు విసిరి టాప్ పొజిషన్​కు చేరుకున్నాడు. ఇక మహిళల 1500మీ పరుగులో హర్మిలాన్‌ బెయిన్స్‌ బంగారు పతకాన్ని సాధించింది. రేస్‌ను 4 నిమిషాల 29.55 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది.

Jyothi Yarraji Medals :గతేడాది జూలై 12న బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్​షిప్స్​లో 23 ఏళ్ల జ్యోతి యర్రాజీ సత్తా చాటింది. ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్​షిప్స్​లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్​లో​ గెలుపొంది భారత్​కు స్వర్ణాన్ని అందించింది. కేవలం 13.09 సెకన్లలో ఈ ఫీట్​ను అందుకుంది. దీంతో పాటు ఆసియా క్రీడల్లోనూ 100 మీటర్ల హర్డిల్స్​లో 12.91సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని జ్యోతి రజత పతకాన్ని అందుకుంది.

Jyothi Yarraji Asian Games 2023 : హై డ్రామా.. ఎట్టకేలకు సిల్వర్ మెడల్​తో మెరిసిన తెలుగు తేజం

భారత్​ ఖాతాలో మూడు స్వర్ణాలు.. సత్తా చాటిన ఆంధ్రా పరుగుల రాణి జ్యోతి!

ABOUT THE AUTHOR

...view details