IPL Starts Not Selected World Cup:ప్రపంచంలోని రిచెస్ట్ స్పోర్ట్స్ లీగ్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ఒకటి. లీగ్‌లో స్టార్ ప్లేయర్‌ల శాలరీ రూ.కోట్లలో ఉంటుంది. ఇండియన్ క్రికెట్ స్టార్లు చాలా మంది రూ.10 కోట్లకు పైగా అందుకుంటున్నారు. అయినా కొంత మంది ప్లేయర్‌లు 2024 టీ20 వరల్డ్‌కప్ ఆడే అవకాశం సంపాదించలేకపోయారు. ఆ ప్లేయర్‌లు ఎవరంటే?
శ్రేయస్ అయ్యర్:కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రూ.12.25 కోట్ల ఐపీఎల్ శాలరీ అందుకుంటున్నాడు. 2021, 2022 వరల్డ్‌కప్ ఎడిషన్లలో కూడా అయ్యర్ బ్యాకప్ ఆప్షన్‌గా స్క్వాడ్‌లో ఉన్నాడు. కానీ, ఈ ఏడాది ఆ అవకాశం రాలేదు.
కేఎల్ రాహుల్:ఐపీఎల్ 2024లోనే అత్యంత ఖరీదైన భారత ఆటగాడు కేఎల్ రాహుల్. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా ఉన్న రాహుల్, ఫ్రాంచైజీ నుంచి రూ.17 కోట్లు అందుకుంటున్నాడు. 2022 టీ20 ప్రపంచకప్‌లో రాహుల్ భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి సెలక్ట్ కాలేదు.
ఇషాన్ కిషన్:ముంబయి ఇండియన్స్ జట్టులో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ ఒకడు. ఫ్రాంచైజీ నుంచి ఏకంగా రూ.15.25 కోట్ల శాలరీ అందుకుంటున్నాడు. అతడు 2021 టీ20 ప్రపంచకప్ ఆడాడు. గత సంవత్సరం ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ జట్టులోనూ సభ్యుడు. కానీ, 2024 టీ20 ప్రపంచకప్‌కి సెలక్టర్లు ఇషాన్‌ను దూరం పెట్టారు.