తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆర్సీబీకి కెప్టెన్ విరాట్ కోహ్లీనే - కానీ అదొక్కటే లోటు!' - IPL 2025 RCB CAPTAIN VIRAT KOHLI

ఐపీఎల్ 2025లో ఆర్సీబీ కెప్టెన్​గా ఎవరు ఉంటారు అనే విషయంపై జోరుగా చర్చ.

IPL 2025 RCB CAPTAIN VIRAT KOHLI
IPL 2025 RCB CAPTAIN VIRAT KOHLI (source Associated Press)

By ETV Bharat Sports Team

Published : Nov 29, 2024, 10:26 AM IST

IPL 2025 RCB CAPTAIN VIRAT KOHLI : వచ్చే ఐపీఎల్ సీజన్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు విరాట్ కోహ్లీనే కెప్టెన్​గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంపై ఆర్సీబీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించనప్పటికీ, జట్టు కూర్పు చూస్తుంటే విరాట్ కెప్టెన్ అవుతాడని, తాను అనుకుంటున్నట్లు తెలిపాడు. పైగా ఇప్పటికే ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీనే అని క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

'వారిని దక్కించుకోవడం సంతోషంగా ఉంది' - ఐపీఎల్ 2025 మెగావేలంలో ఆర్సీబీ దక్కంచుకున్న ఆటగాళ్లపై కూడా యూట్యూబ్ ఛానల్ వేదికగా డివిలియర్స్ స్పందించాడు. మెగావేలంలో పేసర్లు భువనేశ్వర్ కుమార్, జోస్ హేజిల్‌ వుడ్, లుంగీ ఎంగిడీని దక్కించుకోవడం సంతోషంగా ఉందని తెలిపాడు. ఎంగిడీ ఫామ్ అందుకుంటే అద్భుతమైన ప్లేయర్ అని, ఆర్సీబీకి కొత్త శక్తిని ఇస్తాడని ప్రశంసించాడు.

"ఏదేమైనా ఆర్సీబీలో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల విన్నింగ్ స్పిన్నర్ లేకపోవడం ఇబ్బందే. ఆర్సీబీ రవిచంద్రన్ అశ్విన్​ను కోల్పోయింది. చెన్నై సూపర్ కింగ్స్ అతడిని దక్కించుకుంది. యెల్లో జెర్సీలో మళ్లీ అశ్విన్​ను చూడడం ఆనందంగా ఉంది. అశ్విన్ రూపంలో మంచి స్పిన్నర్​ను ఆర్సీబీ కోల్పోయింది. ముఖ్యంలో విదేశాల్లో అడేటప్పుడు ఇలాంటి స్పిన్నర్ చాలా అవసరం. ఐపీఎల్ పాలకవర్గం, బీసీసీఐ బదిలీ విండోను తీసుకురావాలని నేను కోరుతున్నాను. అప్పుడు వేలంలో అన్ సోల్డ్​గా మిగిలిపోయిన స్పిన్నర్లను ఆర్సీబీ కొనుగోలు చేయవచ్చు." అని ఏబీ డిలిలియర్స్ వ్యాఖ్యానించాడు.

మళ్లీ కెప్టెన్​గా కోహ్లీనే!
ఆర్సీబీ జట్టుకు 2013-2021 వరకు కెప్టెన్​గా విరాట్ కోహ్లీ వ్యవహరించాడు. అతడి సారథ్యంలో ఆర్సీబీ నాలుగుసార్లు ప్లేఆఫ్స్​కు చేరింది. 2016లో ఫైనల్​కు చేరి త్రుటిలో కప్పును చేజార్చుకుంది. గత సీజన్​లో ఆర్సీబీకి కెప్టెన్​గా ఫాఫ్ డుప్లెసిస్ ఉన్నాడు. అతడిని ఆ జట్టు అట్టిపెట్టుకోలేదు. దీంతో కెప్టెన్​గా మళ్లీ కోహ్లీనే బాధ్యతలు చేపడతారని క్రికెట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఆర్సీబీ జట్టు
వేలంలో దక్కించుకున్న ప్లేయర్స్ - హేజిల్‌వుడ్ (రూ.12 కోట్లు), ఫిల్ సాల్ట్ (రూ.11.50 కోట్లు), జితేశ్‌ శర్మ (రూ.11 కోట్లు), భువనేశ్వర్ కుమార్‌ (రూ.10.75 కోట్లు), లివింగ్‌స్టన్ (రూ.8.75 కోట్లు), రసిక్ దర్‌ (రూ.6 కోట్లు), కృనాల్ పాండ్య (రూ.5.75 కోట్లు), టిమ్ డేవిడ్ (రూ.3 కోట్లు), జాకబ్ బెథెల్ (రూ.2.60 కోట్లు), సుయాష్ శర్మ (రూ.2.60 కోట్లు), దేవ్‌దత్‌ పడిక్కల్‌(రూ.2కోట్లు), నువాన్ తుషార (రూ.1.60 కోట్లు), రొమారియో షెఫర్డ్ (రూ.1.50 కోట్లు), ఎంగిడి(రూ.కోటి), స్వప్నిల్ సింగ్ (రూ.50 లక్షలు), మోహిత్‌ రాధే(రూ.30లక్షలు), అభినందన్‌ సింగ్‌(రూ.30లక్షలు), స్వస్తిక్‌ చికారా(రూ.30లక్షలు), మనోజ్‌ భాండాగే (రూ. 30 లక్షలు)

రిటైన్‌ ప్లేయర్స్ : విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు), యశ్ దయాల్ (రూ.5 కోట్లు), రజత్ పటిదార్ (రూ.11 కోట్లు)

ABOUT THE AUTHOR

...view details