IPL 2025 Mega Auction Young Players Most Valuable : ఐపీఎల్ వేలంలో క్రికెట్ అభిమానుల అందరి కళ్లూ స్టార్ ప్లేయర్స్‌పైనే ఉంటాయి. వీరంతా ఎంత ధర పలుకుతారా అనే చూస్తారు. అయితే ఈ సారి పంత్, శ్రేయస్, అర్ష్‌దీప్ లాంటి ప్లేయర్స్ ఎక్కువ ధర పలికి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇదే సమయంలో పెద్దగా పేరు లేని కొంతమంది యంగ్ ప్లేయర్స్ వేలంలో ఊహించని ధర దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. మరి ఇంతకు వారెవరో ఈ కథనంలో తెలుసుకుందాం.
మరో మలింగ - ఐపీఎల్ ఆల్ టైం గ్రేట్ బౌలర్లలో ఒకడు లసిత్ మలింగ. ఇప్పుడు అదే పేరుతో, మరో టాలెంట్ పేసర్ లంక క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. అతడి పేరే ఇషాన్ మలింగ. శ్రీలంక జట్టులో నిలకడగా రాణించాడు. ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగానూ నిలిచాడు. ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయలదు. ఇతడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.1.2 కోట్లు వెచ్చించి దక్కించుకుంది.
సిక్సర్ల ఆర్య - రీసెంట్గా దిల్లీ ప్రిమియర్ లీగ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది తన పేరు మార్మోగేలా చేశాడు ప్రియాంశ్ ఆర్య. ఇదే లీగ్‌లోని మరి కొన్ని మ్యాచ్‌ల్లోనూ అద్భుతంగా రాణించాడు. దీంతో ఈ హార్డ్ హిట్టర్ కోసం పోటీ నెలకొనగా, పంజాబ్ కింగ్స్ రూ.3.8 కోట్లకు దక్కించుకుంది.
రషీద్లా మరో మిస్టరీ స్పిన్నర్ - అఫ్గానిస్థాన్ స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్ వయసు కేవలం 18 ఏళ్లే. రీసెంట్‌గానే ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఇతడు, ఐపీఎల్ వేలంలో మొదటి సారి తన పేరును నమోదు చేసుకున్నాడు. అయినా కూడా రూ.4.8 కోట్లతో అమ్ముడుపోయి అందరినీ షాక్‌కు గురి చేశాడు.
ఇతడు రీసెంట్గా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 6 వికెట్ల తీసి అదరగొట్టాడు. దీంతో వేలంలో అతడి కోసం గట్టి పోటీ నెలకొంది. చివరికి ముంబయి ఇండియన్స్ దక్కించుకుంది.