IPL 2024 Sunrisers Hyderabad New Jersy :ఐపీఎల్ 2024 సీజన్‌కు సంబంధించి కొత్త జెర్సీని ఆవిష్కరించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ నయా జెర్సీని ధరించిన వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఫొటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. మా కొత్త జెర్సీ ఇదే అంటూ క్యాప్షన్‌గా రాసుకొచ్చింది. అయితే ఈ జెర్సీ మనకు కొత్త కానీ సన్‌రైజర్స్‌కు కాదు. ఎందుకంటే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో తమ ఫ్రాంచైజీకి చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు ఈ జెర్సీనే ధరిస్తోంది. దీన్ని ధరించే వరుసగా రెండు సీజన్లలో టైటిల్‌ను గెలవడం విశేషం. దీంతో తమకు అచ్చొచ్చిన జెర్సీనే ఈ ఐపీఎల్ సీజన్లో కొనసాగించాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. జెర్సీతో పాటు కిట్ మొత్తాన్ని కూడా ఐపీఎల్లో కొనసాగించనుందట. ఈ జెర్సీని చూసిన కొంతమంది నెటిజన్లు మిక్స్డ్ కామెంట్లు చేస్తున్నారు. జెర్సీని మార్చడం కాదు ముందు గెలిచి చూపించండి. అప్పుడు చూద్దాం మీ సత్తా ఏంటో అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే ఈ సీజన్‌కు సంబంధించి ఐపీఎల్ నిర్వాహకులు ఏర్పాట్లను వేగవంతం చేసేశారు. ఫ్రాంచైజీలన్నీ తమ ఆటగాళ్లను శిబిరాలకు రప్పిస్తున్నాయి. చాలా మంది ప్లేయర్లు కూడా ఇప్పటికే నెట్స్‌లో సాధన చేయడం మొదలుపెట్టేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ఐపీఎల్-2024 కోసం రెడీ అవుతోంది. ఆ జట్టు ఆటగాళ్లు ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్స్‌లో కూడా పాల్గొంటున్నారు.