IPL 2024 Rohith Sharma : ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తాజా మ్యాచులో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. ముంబయి నిర్దేశించిన లక్ష్యాన్ని రాజస్థాన్ ఛేదించే సమయంలో ఓ వ్యక్తి సెక్యూరిటీ సిబ్బంది కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మవైపు పరుగెత్తుకొచ్చాడు. దీనిని సడెన్‌గా గమనించిన హిట్ మ్యాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆ తర్వాత సదరు వ్యక్తిని కౌగిలించుకుని గ్రౌండ్‌లో నుంచి బయటికి వెళ్లాలని సూచించాడు.ఇకపోతే హిట్ మ్యాన్‌ను కౌగిలించుకున్న ఆ వ్యక్తి ఆ తర్వాత పక్కనే ఉన్న ఇషాన్ కిషన్‌తోనూ కరచాలనం చేసి అభిమానంతో హగ్ ఇచ్చాడు. ఈ సమయంలోనే సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకుని బయటకు తీసుకెళ్లారు.
పాండ్యకు అండగా రోహిత్(Hardik Panyda Rohith Sharma) - రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య నియమితుడైనప్పటి నుంచి విమర్శలు ఎక్కువయ్యాయి. మ్యాచులో కోసం వెళ్లిన ప్రతి సారి స్టేడియంలో ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వస్తోంది. తాజాగా హోం గ్రౌండ్ వాంఖడేలోనూ అది మరింత ఎక్కువైంది. ఆ హేళన మరింత ఎక్కువ అవ్వడంతో ఆ సమయంలో పాండ్యకు మాజీ కెప్టెన్ రోహిత్ అండగా నిలవడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట బాగా చక్కర్లు కొడుతున్నాయి. క్రికెట్ అభిమానులు వీటిని తెగ ఫార్వాడ్ చేస్తున్నారు.