IPL 2024 Punjab Kings vs Sunrisers Hyderabad : గత రెండు సీజన్లకు భిన్నంగా ప్రస్తుత ఐపీఎల్ ఎడిషన్‌లో దూకుడు కొనసాగిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి తన దూకుడు ప్రదర్శించింది. ఇప్పటికే రెండు విజయాలు సాధించిన హైదరాబాద్ తాజాగా మరో మ్యాచ్‌లోనూ గెలుపొందింది. అంటే దీంతో మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ వంటి పటిష్ఠమైన జట్లను ఓడించిన ఆరెంజ్ ఆర్మీ ఈ సారి పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో మరోసారి అదరగొట్టేసింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ (37 బంతుల్లో 4 ఫోర్లు, 5 ఫోర్లు సాయంతో 64) చెలరేగి ఆడడంతో విజయం వరించింది. ఫలితంగా ఉత్కంఠగా సాగిన పోరులో 2 పరుగులు తేడాతో గెలిచింది.
183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ శసాంక్ సింగ్(46) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సామ్ కరన్(29), సికందర్ రాజా(28), కెప్టెన్ శిఖర్ ధావన్(14), జితేశ్ శర్మ(19) పరుగులు చేశారు. భువనేశ్వర్ కుమార్ 2, ప్యాట్ కమిన్స్, నటరాజన్, నితీశ్ రెడ్డి, జయదేవ్ ఉనద్కత్ తలో వికెట్ తీశారు.