తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోని కెప్టెన్సీ వదిలేస్తున్నాడా? న్యూ రోల్‌ అంటూ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌ - IPL 2024 Dhoni New Role

IPL 2024 Dhoni New Role : కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ ఐపీఎల్​ సీజన్​లో తాను పాల్గొనడం​పై తన ఫేస్‍బుక్ అకౌంట్‍లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ఆ వివరాలు.

ధోని కెప్టెన్సీ వదిలేస్తున్నాడా? న్యూ రోల్‌ అంటూ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌
ధోని కెప్టెన్సీ వదిలేస్తున్నాడా? న్యూ రోల్‌ అంటూ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 8:53 PM IST

Updated : Mar 4, 2024, 9:59 PM IST

IPL 2024 Dhoni New Role : టీమ్​ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన బ్యాట్​తో ఐపీఎల్​ మెరుపులు మెరిపిస్తే చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎప్పటిలాగే మహీ రిటైర్మెంట్ ఇస్తాడనే వార్తలు గత కొద్ది రోజులుగా గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడతడు అందు ఫేక్ అని తేలిపోయింది. అలానే ధోనీ కూడా ఈ ఐపీఎల్​ సీజన్​లో తాను పాల్గొనడం​పై తన ఫేస్‍బుక్ అకౌంట్‍లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. కొత్త సీజన్, కొత్త రోల్ కోసం ఎదురుచూడలేకున్నా.స్టే ట్యూన్డ్! అంటూ రాసుకొచ్చాడు.

మహీ మాత్రమే కాదు, చైన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కూడా ఓ ట్వీట్ పోస్ట్ చేసి సస్పెన్స్‌ను మరింత పెంచింది. కొత్త పాత్రలో లియో అంటూ రాసుకొచ్చింది. అలా ప్రస్తుతం ధోనీ, సీఎస్కే చేసిన పోస్ట్‌లు అభిమానుల్లో ఉత్సుకతను రేకెత్తిస్తున్నాయి. దీంతో కెప్టెన్సీ బాధ్యతలను ధోనీ వదిలేయనున్నాడా? ఇంతకీ కొత్త సీజన్​లో ఆ న్యూ రోల్ ఏంటి? అనే విషయంపై అభిమానుల్లో కొత్త చర్చ మొదలైంది. కొంపతీసి బ్యాటర్​గా, కెప్టెన్​గా రిటైర్మెంట్ ప్రకటించి కోచ్​గా వ్యవహరించబోతున్నాడా? అని పలువురు నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది మహీ మెంటార్‌గా పని చేయబోతున్నాడంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా మహీ అయితే రిటైర్మెంట్‌ ప్రకటించట్లేదని ఇంకొంతమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రకరకాలుగా స్పందిస్తున్నారు.

కాగా, ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్​ ఇప్పటివరకు 5 సార్లు ట్రోఫీని ముద్దాడింది. గత సీజన్‌లోనూ అతడి నాయకత్వంలోనే సీఎస్కే టైటిల్​ను గెలుచుకుంది. ఆ తర్వాత మహీ మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇకపోతే రీసెంట్​గా అతడు ఈ సీజన్ కోసం ప్రాక్టీస్‌ చేయడం మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొట్టాయి. దీంతో 2024 సీజన్‌లో అతడు ఆడడం ఖాయమని చాలా మంది భావించారు. మరి ఇలాంటి సమయంలోనే మహీ తాజాగా పెట్టిన పోస్టు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ఈ ఐపీఎల్​ సీజన్​లో మహీ కొత్త రోల్ ఏంటో?

Last Updated : Mar 4, 2024, 9:59 PM IST

ABOUT THE AUTHOR

...view details