IPL 2024 CSK VS RCB Records :ఐపీఎల్ 17వ సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ -రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో ప్రారంభమైంది. ఈ పోరులో గెలిచి చెన్నై శుభారంభం చేసింది. 6 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో బాగానే రికార్డులు నమోదయ్యాయి. అవేంటో చూద్దాం.
- ఐపీఎల్ సీజన్ ప్రారంభ మ్యాచుల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇది నాలుగో పరాజయం. మొత్తంగా ఇప్పటివరకు ఐదు మ్యాచుల్లో తలపడింది. కానీ ఇందులో ఒకే ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. 2021 సీజన్‌లో ముంబయిపై 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. మిగతా నాలుగింటిలోనూ ఓటమే.
- చెపాక్ స్టేడియం వేదికా చెన్నై సూపర్ కింగ్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 9 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో 8 మ్యాచుల్లో సీఎస్కే గెలిచింది. కేవలం ఒక్క దాంట్లోనే బెంగళూరు గెలుపొందింది. 2008 సీజన్‌లో ఇది జరిగింది.
- తాజా విజయంతో సీఎస్క్ ఓ ఘనత సాధించింది. ఐపీఎల్‌లో ఒక జట్టుపై అత్యధిక విజయాలు నమోదు చేసిన రెండో టమ్గా నిలిచింది. బెంగళూరుపై 21 మ్యాచుల్లో సీఎస్కే గెలుపొందింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ముంబయి ఇండియన్స్ 23 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది.
- ఈ మ్యాచ్‌లో మరో రికార్డ్ కూడా నమోదైంది. ఒక్క అర్ధ శతకం లేకుండానే ఎక్కువ పరుగులు నమోదైన ఫస్ట్ మ్యాచ్‌గా సీఎస్కే - ఆర్సీబీ పోరు నిలిచింది. ఈ పోరులో 349 పరుగులు నమోదయ్యాయి. బెంగళూరు బ్యాటర్ అనుజ్ రావత్ (48) టాప్ స్కోరర్.
- ఇంపాక్ట్ ప్లేయర్ శివమ్ దూబె ఈ మ్యాచ్‌లో 28 బంతుల్లో 34 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. అతడికి ఆర్సీబీపై మంచి రికార్డ్ ఉంది. మొత్తం నాలుగు మ్యాచుల్లో 227 పరుగులు చేశాడు.
- దినేశ్ కార్తిక్ - అనుజ్ రావత్ కలిసి ఆరో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఐపీఎల్‌లో ఆర్సీబీ జట్టుకు ఈ వికెట్‌కు ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. అంతకుముందు 2022లో షహబాజ్‌తో కలిసి కార్తిక్ 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సీఎస్కే జట్టుపై ఆరో వికెట్‌కు ఇదే అత్యధికం.
- ఈ మ్యాచ్‌లో ముస్తాఫిజర్ రహ్మాన్ తన బౌలింగ్‌తో అదరగొట్టాడు. సీఎస్కే తరఫున ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసిన రెండో బౌలర్‌గా రికార్డుకెక్కాడు. 2009లో షాదాబ్ జకాతి (4/24) బెస్ట్ బౌలింగ్ సంధించాడు.