తెలంగాణ

telangana

ETV Bharat / sports

రచిన్ రవీంద్ర - అరంగేట్రంలోనే అద్భుతం - IPL 2024 CSK VS RCB - IPL 2024 CSK VS RCB

IPL 2024 CSK VS RCB Rachin Ravindra : ఐపీఎల్ 17వ సీజన్​లో భాగంగా ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్​లో సీఎస్కే ప్లేయర్ రచిన్ రవీంద్ర అదరగొట్టాడు. తన అరంగేట్ర మ్యాచ్​లోనే సత్తా చాటాడు. ఆ వివరాలు.

రచిన్ రవీంద్ర - అరంగేట్రంలోనే అద్భుతం
రచిన్ రవీంద్ర - అరంగేట్రంలోనే అద్భుతం

By ETV Bharat Telugu Team

Published : Mar 23, 2024, 10:55 AM IST

IPL 2024 CSK VS RCB Rachin Ravindra :న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర తన ఐపీఎల్ అరంగేట్రాన్ని అద్భుతంగా చేశాడు. సీఎస్కే జట్టుతో అరంగేట్రం ఇచ్చిన అతడు తన తొలి మ్యాచ్​ను ఆర్సీబీపై అదిరే ప్రదర్శన చేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. వాస్తవానికి 174 అంటే అంత తేలికైన లక్ష్యం కాదు. పైగా స్పిన్నర్లకు బాగా అనుకూలించే చెపాక్‌ పిచ్‌పై ఛేదన అంటే చెన్నై కష్టపడుతుందేమోనని అంతా అనుకున్నారు.

కానీ తన తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌లోనే రెచ్చిపోయి ఆడాడు రచిన్ రవీంద్ర. బ్యాటింగ్‌ అద్భుతంగా చేసి మ్యాచ్‌ను సీఎస్కే వైపు తిప్పేశాడు. కేవలం 15 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 37 పరుగులు చేశాడు. అలా లక్ష్య ఛేదనలో సీఎస్కేకు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. కెప్టెన్‌ రుతురాజ్‌ (15) ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయినా - రచిన్​​​ తక్కువ బంతుల్లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి ఆర్సీబీ బౌలర్లను బంబేలెత్తించాడు. అతడి దెబ్బకు పవర్‌ ప్లేలో చెన్నై వికెట్​ నష్టానికి 61 పరుగులు సాధించింది.

అయితే హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న రచిన్​ కర్ణ్‌ బౌలింగ్‌లో ఓ భారీ షాట్‌ ఆడి ఔటయ్యాడు. కానీ ఇతడి జోరు వల్ల సాధించాల్సిన రన్‌రేట్‌ కూడా తగ్గింది. దీంతో తర్వాతి బ్యాటర్లకు పని తేలికగా అయిపోయింది. దీంతో ప్రస్తుతం రచిన్ రవీంద్ర ఇన్నింగ్స్‌లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇది చూసిన క్రికెట్ అభిమానులు, నెటిజన్లు అతడిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. చెన్నై జట్టుకు మరో స్టార్ దొరికేశాడంటూ అభిప్రాయపడుతున్నారు.

ఇకపోతే ఐపీఎల్‌-2024 మినీ వేలంలో చెన్నై సూపర్‌ కింగ్స్ జట్టు రచిన్‌ రవీంద్రను రూ. 1.80 కోట్లకు దక్కించుకుంది. ఆ నమ్మకాన్ని అతడు తొలి మ్యాచ్​లోనే కాపాడుకున్నాడు. ఫీల్డింగ్‌లోనూ రెండు అద్భుతమైన క్యాచ్‌లు పటుకున్నాడు. అందులో ఒకటి ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్​ది. దూకుడుగా ఆడుతున్న అతడి బంతిని క్యాచ్ పట్టుకుని రవీంద్ర పెవిలియన్‌కు పంపాడు. మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో సీఎస్కే బోణీ కొట్టింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి 6 వికెట్లు తేడాతో విజయాన్ని సాధించింది.

చెన్నై ఛమక్​ - ఆర్సీబీతో మ్యాచ్​లో నమోదైన సూపర్ రికార్డులివే! - IPL 2024 CSK VS RCB

ఆర్సీబీకి షాక్​ - బోణీ కొట్టిన చెన్నై - CSK vs RCB IPL 2024

ABOUT THE AUTHOR

...view details