India vs Pakistan WTC Final : ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో భారత్-పాకిస్థాన్ తలపడే అవకాశాలపై క్రికెట్ ప్రపంచంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. WTC ఫైనల్లో భారత్-పాక్ తలపడే అవకాశాలు సాంకేతికంగా ఉన్నా, వాస్తవంగా అది దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. రావల్పిండి టెస్ట్‌లో పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ చరిత్రాత్మక విజయంతో పాక్ జట్టు WTC ఫైనల్ అవకాశాలు దాదాపుగా సన్నగిల్లాయి. ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు పాక్ చేరడం ఆ జట్టుకు శక్తికి మించిన పనేలా కనిపిస్తోంది.
పాయింట్ల పట్టికలో దిగువన -ప్రస్తుతం WTC పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ ఎనిమిదో స్థానంలో ఉంది. ఇప్పటివరకూ ఆరు టెస్టులు ఆడిన దాయాది దేశం కేవలం రెండే విజయాలే సాధించి 30.56 విజయ శాతంతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. WTC ఫైనల్‌కు పాకిస్థాన్ చేరుకోవాలంటే అద్భుతాలు జరగాల్సిందే. ప్రస్తుత WTC సైకిల్‌లో పాక్ జట్టుకు ఇంకా ఎనిమిది టెస్టులు మిగిలి ఉన్నాయి. ఈ ఎనిమిది మ్యాచుల్లోనూ విజయం సాధిస్తేనే పాక్ తుది పోరుకు అర్హత సాధిస్తుంది. ఇంగ్లాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో పాకిస్థాన్ ఈ టెస్టు మ్యాచులు ఆడనుంది. ఈ అగ్ర జట్లపై పాకిస్థాన్ అన్ని మ్యాచులు గెలవడం అంటే మాటలు కాదు. దక్షిణాఫ్రికాను వారి దేశంలోనే ఓడించడం పాక్‌కు శక్తికి మించిన పనే అనే చెప్పాలి.
ఫేవరేట్‌గా భారత్, ఆసిస్ -వచ్చే ఏడాది జరిగే WTC ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా మరోసారి తలపడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం WTC పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు టాప్ పొజిషన్‌లో కొనసాగుతున్నాయి. భారత్ తొమ్మిది మ్యాచుల్లో ఆరు విజయాలతో 68.52 విజయాల శాతంతో అగ్ర స్థానంలో ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా 12 మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలతో 62.50 విజయ శాతంతో రెండో స్థానంలో ఉంది. ఇక ఈ ఏడాది చివర్లో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఈ రెండు జట్లకు కీలకం కానుంది. ఈ సిరీస్‌లో విజయం సాధించి WTC ఫైనల్‌లో తమ స్థానాలను ఖాయం చేసుకోవాలని భారత్-ఆస్ట్రేలియా గట్టి పట్టుదలతో ఉన్నాయి.
WTC ఫైనల్లో భారత్-పాక్ తలపడటం సాధ్యమేనా? - Ind vs Pak World Test Championship - IND VS PAK WORLD TEST CHAMPIONSHIP
India vs Pakistan WTC Final : బంగ్లాదేశ్ చేతిలో ఘోర పరాజయంతో WTC ఫైనల్లో భారత్-పాక్ తలపడే అవకాశాలు దాదాపు అసాధ్యం అనిపిస్తోంది. పూర్తి వివరాలు స్టోరీలో.
Published : Aug 26, 2024, 12:33 PM IST
ఇక పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ తాజా విజయంతో ఐదు మ్యాచ్‌లలో రెండు విజయాలు సాధించి 40.00 విజయ శాతంతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకుంది. ఈ విజయం బంగ్లాదేశ్‌కు వారి టెస్టు క్రికెట్ చరిత్రను మార్చే అవకాశం ఉంది. మరోవైపు మొదటి టెస్టులో శ్రీలంకను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన ఇంగ్లాండ్ WTC పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. శ్రీలంక ఐదో స్థానానికి పడిపోయింది.
పాక్ ఓటమికి భారతే కారణం - బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పాక్ ఓడిపోవడానికి పరోక్షంగా టీమ్‌ఇండియానే కారణమని మాజీ క్రికెటర్ రమీజ్ రజా వ్యాఖ్యానించాడు. తమ జట్టు ఎంపికపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. పాక్ జట్టు ఎంపికలో లోపాలున్నాయన్న రమీజ్ రాజా స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగడాన్ని తప్పుపట్టాడు. ఆసియా కప్‌లో తమ పేసర్లపై భారత్ ఆధిపత్యం ప్రదర్శించిందని సీమింగ్‌కు అనుకూలంగా మారిన పిచ్‌లపైనే పాక్ బౌలర్లు ఇబ్బందిపడ్డారని గుర్తు చేశాడు. ఆ తర్వాత ఇతర జట్లూ పాక్ బౌలింగ్‌ను సలువుగా ఆడేస్తున్నాయన్నాడు.
'డిక్లేర్డ్' నిర్ణయంతో ఓటమి - పాక్ 4, భారత్ 1 - Losing Test Match After Declaring
పెళ్లి గురించి ప్రశ్న - సిగ్గుపడుతూ మను బాకర్ ఏం చెప్పిందంటే? - Manu Bhaker Marriage