తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోచ్ కూతురితో సీక్రెట్​ లవ్ ట్రాక్​ - 13 ఏళ్లు డేటింగ్​ చేశాక పెళ్లి! - Sunil Chhetri Love story - SUNIL CHHETRI LOVE STORY

Sunil Chhetri Love story : భారత స్టార్ ఫుట్​బాలర్​ సునీల్‌ ఛెత్రి తాజాగా తన కెరీర్​కు గుడ్​ బై అందరినీ షాక్​కు గురి చేశాడు. అయితే అతడి ప్రొఫెషనల్​ కెరీర్​ గురించి చాలా మందికి తెలుసు. కానీ ఈ దిగ్గజ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ పర్సనల్ లవ్​ లైఫ్‌ చాలా తక్కువ మందికి తెలుసు. దాని గురించే ఈ కథనం.

Source Getty Images
Sunil Chhetri (Source Getty Images)

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 8:02 PM IST

Sunil Chhetri Love story :లెజెండరీ ఇండియన్ ఫుట్‌బాల్ ప్లేయర్‌ సునీల్ ఛెత్రి, ఇంటర్నేషనల్‌ ఫుట్‌బాల్‌ నుంచి రిటైర్‌ అవ్వబోతున్న తెలిపి అందరినీ షాక్​కు గురి చేశాడు. 19 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలకనున్నట్లు తెలిపాడు. జూన్ 6న కోల్‌కతాలో కువైట్‌తో జరిగే ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ రెండో రౌండ్ తర్వాత రిటైర్ అవుతానని ఛెత్రి ప్రకటించాడు. దీనికి సంబంధించి సోషల్‌ మీడియాలో 10 నిమిషాల ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేశాడు. ఫుట్‌బాల్ నుంచి రిటైర్ కావాలనే నిర్ణయం గురించి చెప్పినప్పుడు తన తల్లి, భార్య కన్నీళ్లు పెట్టుకున్నట్లు చెప్పాడు.

  • మొదటి చూపులోనే కలిగిన ఇష్టం
    కోల్‌కతాలో ఓ మ్యాచ్‌ సందర్భంగా సునీల్‌ ఛెత్రి మొదటిసారి తన భార్య సోనమ్ భట్టాచార్యను కలిశాడు. మ్యూచువల్‌ ఫ్రెండ్స్‌ ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు. అప్పుడే ఒకరంటే ఒకరికి ఇష్టం కలిగింది. సోనమ్15 ఏళ్ల వయసులో మొదటిసారి తన తండ్రి ఫోన్ నుంచి సునీల్(18ఏళ్ల వయసులో) నంబర్‌ తీసుకుంది. తన తండ్రికి తెలుస్తుందేమోనని భయపడుతూనే, ఛెత్రికి మెసేజ్‌ చేసింది. అయితే ఆమెవరో తెలీకుండానే మెసేజ్ చేసిన ఛెత్రి ఆ తర్వాత తన కోచ్ కూతురు అని తెలిసి భయంతో తనకు దూరం ఉండేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ వాళ్లు దూరంగా ఉండలేకపోయారు. కొంత కాలానికి డేటింగ్‌ ప్రారంభించారు.

బిజీ షెడ్యూల్‌లోనూ ఒకరినొకరు బాగా తెలుసుకోవడం కోసం క్వాలిటీ టైమ్‌ స్పెండ్‌ చేసేవారట. ఛెత్రి విదేశాలకు తరచూ ట్రావెల్‌ చేస్తున్నా, సోనమ్‌తో కలిసి సినిమాకు వెళ్లేందుకు, కలిసేందుకు ప్లాన్‌ చేసేవాడు. అలానే ఒకరి లక్ష్యాలకు మరొకరు మద్దతుగా నిలవడంతో వారి బంధం మరింత బలపడింది. ఫుట్‌బాల్‌పై సునీల్ ఛెత్రీకి ఉన్న అంకితభావం సోనమ్ భట్టాచార్యను బాగా ఆకట్టుకుంది.

  • 2017లో వివాహం
    చాలా సంవత్సరాల డేటింగ్ తర్వాత సునీల్ ఛెత్రి, సోనమ్ భట్టాచార్యకు ప్రపోజ్ చేశాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత కాస్త తటపటాయిస్తూనే ఆమె తండ్రి, తన మాజీ కోచ్‌ ముందుకు వెళ్లి విషయం చెప్పాడు. అయితే రెండు కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి. అలా దాదాపు 13 సంవత్సరాలు డేటింగ్ తర్వాత 2017 డిసెంబర్ 4న సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఛెత్రి, సోనమ్‌ ప్రేమకు ప్రతి రూపంగా 2023లో కొడుకు ధ్రవ్‌ జన్మించాడు.

ఛెత్రి తన విజయాలలో సోనమ్‌ పాత్ర వెలకట్టలేనిదని, ప్రతి అడుగులో తోడుందని, అన్ని విషయాల్లో తనకు సహకారం అందించిందని చాలా సార్లు చెబుతుంటాడు. ఎంత బిజీగా ఉన్నా వ్యక్తిగత జీవితాన్ని అశ్రద్ధ చేయకుండా, అన్ని అంశాలను బ్యాలెన్స్‌ చేసుకుంటూ ముందుకు సాగిన ఈ జంట అందరికీ ఆదర్శం.

ఫుట్​బాల్​కు సునీల్ ఛెత్రి గుడ్​బై- అదే ఆఖరి మ్యాచ్ - Sunil Chhetri Retirement

భారత్ x పాకిస్థాన్ మ్యాచ్​కు 'ఫ్యాన్ పార్క్'- బిగ్ స్క్రీన్​లో లైవ్ స్ట్రీమింగ్- ఎక్కడంటే? - 2024 World Cup

ABOUT THE AUTHOR

...view details