IND VS SL Ajit Agarkar :శ్రీలంకతో ఈ నెలాఖరులో జరిగే టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యాను కాదని సూర్య కుమార్ యాదవ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించడంపై టీమ్‌ఇండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. "ఎప్పుడూ అందుబాటులో ఉండే ఆటగాడికే కెప్టెన్సీ ఇవ్వాలని నిర్ణయించాం. అందుకే సూర్య కుమార్‌కు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాం" అని అగార్కర్ వెల్లడించాడు.
Hardki Pandy captaincy : హార్దిక్ భారత జట్టులో కీలక ప్లేయర్ అని, కానీ సూర్యకు కెప్టెన్ అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని అగార్కర్ స్పష్టం చేశాడు. ఫిట్‌నెస్, డ్రెస్సింగ్ రూమ్ ఫీడ్‌బ్యాక్ వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సూర్యకు పగ్గాలు అప్పగించామని అగార్కర్ పేర్కొన్నాడు. జులై 27 నుంచి శ్రీలంకతో భారత జట్టు మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడనుంది. శ్రీలంక పర్యటనకు బయల్దేరే ముందు నూతన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో కలిసి అగార్కర్ మీడియా సమావేశంలో పాల్గొని ఈ కామెంట్స్ చేశారు.
ఫిట్‌నెస్ చాలా ముఖ్యం - "టీ20 క్రికెట్‌లో ఫిట్‌నెస్ చాలా ముఖ్యమైన విషయం. ఈ ఫార్మాట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఆటగాడినే కెప్టెన్ చేయాలని నిర్ణయించాం. సూర్య అత్యుత్తమ టీ20 బ్యాటర్లలో ఒకడు. కెప్టెన్‌గా కూడా అతడు విజయవంతమయ్యాడు. హార్దిక్ పాండ్యా నైపుణ్యంపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. అతడు తరచుగా అందుబాటులో ఉండకపోవడంతోనే కెప్టెన్ పగ్గాలు సూర్యకు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నాం. డ్రెస్సింగ్ రూమ్ నుంచి కూడా ఆటగాళ్ల అభిప్రాయం తీసుకున్న తర్వాతే సూర్యకు(Suryakumar Yadav Captaincy) ఈ బాధ్యతలు అప్పగించాం" అని అగార్కర్ తెలిపాడు.
వన్డేలకు జడేజా ఉంటాడు - "వన్డే జట్టు నుంచి రవీంద్ర జడేజాను తొలగించామన్న వార్తలు నిజం కాదు. జడేజా వన్డే కెరీర్ కూడా ముగిసిందన్న వార్తలు నిరాధారం. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఇద్దరిని మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు తీసుకుంటే అది అర్థరహితంగా ఉండేది. జట్టు సమతూకం కోసమే అక్షర్‌ను జట్టులోకి తీసుకున్నాం. వచ్చే సిరీస్‌లలో జడేజాను పరిగణనలోకి తీసుకుంటాం" అని అగార్కర్ స్పష్టం చేశాడు.