తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాకిస్థాన్​ గెలుపుపై భారత జట్టు ఆశలు! - అలా జరగకపోతే ఇక అంతే! - ICC T20 WORLDCUP 2024

పాకిస్థాన్​పై ఆధారపడిన టీమ్​ ఇండియా మహిళల జట్టు - కివీస్​తో మ్యాచ్​లో పాక్ గెలిస్తేనే సెమీస్​కు భారత్

source Associated Press
ICC T20 Worldcup 2024 Teamindia Pakisthan (source Associated Press)

By ETV Bharat Sports Team

Published : Oct 14, 2024, 4:04 PM IST

ICC T20 Worldcup 2024 India Women Semi Final Race : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో విభిన్నమైన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా పాకిస్థాన్ మ్యాచ్ ఆడుతుంటే ఆ జట్టు ఓడిపోవాలని భారత అభిమానులు కోరుకుంటారు. కానీ, ఈ సారి మాత్రం పాక్ ఆడుతుంటే ఆ జట్టు గెలవాలని భారత అభిమానులు కోరుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే?

పాక్ గెలిస్తే ఓకే- లేదంటే ఇంటికే! -గ్రూప్‌-ఏ చివరి మ్యాచ్‌లో కివీస్​తో పాక్ తలపడనుంది. ఈ మ్యాచ్​లో పాక్ గెలుపొందింతే టీమ్ ఇండియా సెమీస్‌కు చేరే అవకాశం ఉంటుంది. ఒకవేళ కివీస్‌ గెలిస్తే మాత్రం భారత జట్టు సెమీస్​కు అర్హత సాధించకుండా, ఇంటిముఖం పడుతుంది. అప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా కివీస్ జట్టు సెమీస్​కు చేరుతుంది.

సెమీస్​కు దూసుకెళ్లిన ఆసీస్ -గ్రూప్‌ Aలో ఆస్ట్రేలియా 4 మ్యాచుల్లో గెలుపొంది సెమీస్​కు చేరింది. భారత్‌ 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో రెండో ప్లేస్​లో నిలిచింది. కివీస్‌ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో మూడో స్థానంలో ఉంది. నెట్‌ రన్‌రేట్‌లో భారత్‌ (+0.322) కంటే న్యూజిలాండ్‌ (+0.282) వెనకబడి ఉండడమే భారత్‌కు కలిసొచ్చే అంశం. పాక్‌ చేతిలో కివీస్‌ ఓడితే, భారత్‌ రెండోస్థానంతో సెమీస్​కు చేరుతుంది. అయితే పాక్‌ గెలిచినా, తేడా మరీ ఎక్కువ ఉండకూడదు. ప్రస్తుతం పాక్‌ నెట్‌ రన్‌రేట్‌ (-0.488) చాలా తక్కువగానే ఉంది. నెట్‌ రన్‌రేట్‌లో తమను అధిగమించని స్థాయిలో పాక్‌ గెలిస్తే, భారత్‌ సెమీస్‌కు చేరుతుంది.

సమీకరణాలు ఎలా ఉన్నాయంటే? -సోమవారం పాకిస్థాన్ జరిగే మ్యాచులో కివీస్‌ మొదట బ్యాటింగ్‌ చేసి కనీసం 150 పరుగులు చేసిందనుకుందాం. అప్పుడు ఆ లక్ష్యాన్ని పాకిస్థాన్‌ 9.1 ఓవర్లలోనే ఛేదించకూడదు. ఒకవేళ అలా జరిగితే మాత్రం భారత్ మూడో స్థానానికి పడిపోయి, పాక్‌ సెమీస్‌కు చేరుతుంది.

ఒకవేళ పాకిస్థాన్‌ మొదట బ్యాటింగ్‌ చేసి 150 పరుగులను కివీస్​కు టార్గెట్‌గా ఇచ్చిందనుకుందాం. ఈ లక్ష్యాన్ని ఛేదించలేక ఓడిపోతే కివీస్ ఇంటిదారి పడుతుంది. అదే సమయంలో పాక్‌ 53 పరుగుల తేడాతో గెలవకూడదు. అలా జరిగితే ఈ జట్టే సెమీస్‌కు వెళ్లిపోతుంది. భారత్‌ ఇంటికెళ్లిపోతుంది.

ఒకవేళ వర్షం వంటి అనివార్య కారణాల వల్ల మ్యాచ్ రద్దైనా కివీస్‌కే మంచిది. మ్యాచ్‌ రద్దు వల్ల ఇరు జట్లకూ చెరొక పాయింట్‌ వస్తుంది. అప్పుడు కివీస్‌ నాకౌట్‌ దశకు చేరుకుంటుంది. భారత్, పాక్‌ ఇంటిముఖం పడతాయి.

పాక్‌పై ఒక్క పరుగు తేడాతో గెలిచినా కివీస్ సెమీస్​కు చేరుతుంది. అప్పుడు కివీస్‌ ఖాతాలో 6 పాయింట్లు అవుతాయి. భారత్‌ 4, పాక్‌ 2 పాయింట్లతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ రెండు జట్లు ఇంటిముఖం పడతాయి.

ఆస్ట్రేలియా చేతిలో ఓడిన హర్మన్​ప్రీత్​ సేన - సెమీస్​ ఆశలు మరింత సంక్లిష్టం

సచిన్, ధోనీకంటే అత్యంత ధనిక క్రికెటర్! - విరాట్​కు ఈయన ఓసారి ఇళ్లు అద్దెకు ఇచ్చారట!

ABOUT THE AUTHOR

...view details