తెలంగాణ

telangana

ETV Bharat / sports

వరల్డ్​కప్ వార్మప్ మ్యాచ్​లు- బంగ్లాదేశ్​తో భారత్ ఢీ- ఎప్పుడంటే? - 2024 T20 World Cup - 2024 T20 WORLD CUP

IND vs BAN Warm Up Match 2024: 2024 టీ20 వరల్డ్​కప్​లో భారత్ ఓ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. జూన్ 1న బంగ్లాదేశ్​తో టీమ్ఇండియా వార్మప్​ మ్యాచ్​లో తలపడనుంది. పూర్తి వార్మప్ మ్యాచ్​ షెడ్యూల్ తెలుసా?

IND vs BAN Warm Up Match
IND vs BAN Warm Up Match (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 17, 2024, 11:20 AM IST

Updated : May 17, 2024, 11:40 AM IST

IND vs BAN Warm Up Match 2024:2024 టీ20 వరల్డ్​కప్ వార్మప్​ మ్యాచ్​ల షెడ్యూల్​ను ఐసీసీ తాజాగా రిలీజ్ చేసింది. మే 27నుంచి జూన్1 వరకు వార్మప్​ మ్యాచ్​లు జరగనున్నాయి. ఇందులో టీమ్ఇండియా ఓ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. జూన్ 1న న్యూయార్క్ వేదికగా బంగ్లాదేశ్‌తో ఈ మ్యాచ్ జరగనుంది. ఈసెన్ హవర్ పార్క్​ మేక్‌షిఫ్ట్ స్టేడియం ఈ మ్యాచ్​కు వేదికకానుంది.

34వేల సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ మైదానాన్ని లెజెండరీ స్ప్రింటర్ ఉసెన్ బోల్ట్ బుధవారం ప్రారంభించాడు. ఇక సాధారణంగా ప్రతి జట్టు రెండేసి వార్మప్ మ్యాచ్​లు ఆడాల్సి ఉంటుంది. అయితే టోర్నీ ప్రారంభానికి తక్కువ సమయం ఉండడం వల్ల 20 జట్లకు రెండేసి మ్యాచ్​లు ఆడించడం కుదరక ఆయా జట్లకు ఒకే వార్మప్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. కాగా, కెనడా, అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్, పపువా న్యూ గినియా, నమీబియా తదితర జట్లు రెండేసి వార్మప్ మ్యాచ్​లు ఆడనున్నాయి.

మే 26న ఐపీఎల్ ముగుస్తుండగా దాదాపు వారంలోపే టీ20 వరల్డ్​కప్ ప్రారంభం కానుంది. టోర్నీలో టీమ్​ఇండియా తొలి 3 లీగ్ గేమ్‌లు న్యూయార్క్ వేదికగానే ఆడాల్సి ఉంది. ఈ మేరకే ప్రయాణ కష్టాలు తగ్గించాలని న్యూయార్క్‌లో వార్మప్ మ్యాచ్‌ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక న్యూయార్క్‌లో వార్మప్ మ్యాచ్ ఆడడం వల్ల టీమ్ఇండియాకు అక్కడి వాతావరణం, పిచ్ పరిస్థితులపై అవగాహన వస్తుంది.

'వరల్డ్​కప్ షెడ్యూల్ చాలా తొందరగా ప్లాన్ చేశారు. ఐపీఎల్ ఫైనల్‌, వరల్డ్​కప్ ఓపెనింగ్ మ్యాచ్‌కు కాస్త ఎక్కువ గ్యాప్ ఉండాల్సింది. పాకిస్థాన్- ఇంగ్లాండ్‌ జట్లు ద్వైపాక్షిక సిరీస్ ముగించుకొని 24 గంటల్లోపే టోర్నీకి సిద్ధమవుతున్నాయి' అని బీసీసీఐ అధికార ప్రతినిథి మాట్లాడారు.

వార్మప్ మ్యాచ్​ల పూర్తి షెడ్యూల్

మే 27

  • కెనడా- నేపాల్
  • ఒమన్- పపువా న్యూ గినియా
  • నమీబియా- ఉగాండా

మే 28

  • శ్రీలంక- నెదర్లాండ్
  • బంగ్లాదేశ్- యూఎస్​ఏ
  • ఆస్ట్రేలియా నమీబియా

మే 29

  • అఫ్గానిస్థాన్- ఒమన్

మే 30

  • నేపాల్- యూఎస్​ఏ
  • స్కాట్లాండ్- ఉగాండా
  • నెదర్లాండ్స్​- కెనడా
  • నమీబియా- పపువా న్యూ గినియా
  • వెస్టిండీస్- ఆస్ట్రేలియా

మే 31

  • ఐర్లాండ్- శ్రీలంక
  • స్కాట్లాండ్- అఫ్గానిస్థాన్

జూన్ 1

  • భారత్- బంగ్లాదేశ్

ఇక ఈ టోర్నీలో 20 దేశాలు తలపడుతున్నాయి. ఈ 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి లీగ్ మ్యాచ్​లు నిర్వహించనున్నారు. యూఎస్ఏ, కెనడా, యుగానా పొట్టి ప్రపంచకప్​లో ఆడడం ఇదే తొలిసారి. జూన్​ 2 నుంచి 30 వరకు టోర్నీ జరగనుంది.

భారత్ x పాకిస్థాన్ మ్యాచ్​కు 'ఫ్యాన్ పార్క్'- బిగ్ స్క్రీన్​లో లైవ్ స్ట్రీమింగ్- ఎక్కడంటే? - 2024 World Cup

రెండో సెమీస్​కు రిజర్వ్​ డేను తొలిగించిన ఐసీసీ - T20 world cup 2024

Last Updated : May 17, 2024, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details