ManuBhaker on Shooting Journey : తాను షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుని ముందుకు సాగుతానని అనుకోలేదని భారత స్టార్ షూటర్ మను బాకర్ తెలిపింది. మొదట్లో తన కెరీర్‌పై స్పష్టత ఉండేది కాదని వెల్లడించింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో క్వశ్చన్స్ అండ్ అన్సర్స్ సెషన్లో పాల్గొన్న మను అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.
"నాకు మొదట్లో కెరీర్ పై క్లారిటీ ఉండేది కాదు. వివిధ క్రీడల్లో ప్రయత్నించాను. ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని అనిపించేది. జీవితంలో ఏదైనా సాధించాలనే కసి ఉండేది. రెండు రోజులకొకసారి విభిన్నమైన ఆటలు, విషయాలను తెలుసుకునేదాన్ని. నేను షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నప్పటికీ తీవ్రమైన పోటీ ఉండేది. అందరికన్నా మెరుగ్గా రాణించాలనుకున్నాను." అని మను బాకర్ వ్యాఖ్యానించింది. ఇంకా పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది మను.
ప్రశ్న : టోక్యో ఒలింపిక్స్‌లో ఓటమి తర్వాత ఎలా పుంజుకున్నారు?
మను సమాధానం : నిలకడగా రాణించి పతకాన్ని గెలువొచ్చని నా మనసులో ఉంది. జీవితంలో ఎదుగుదల ఉంటుందని నేను నమ్ముతాను. టోక్యో ఒలింపిక్స్ 2020 ఓటమి తర్వాత గేమ్‌ను వదులుకోవాలనుకున్నప్పుడు మా అమ్మ, కోచ్ జస్పాల్ రాణా నాకు అండగా నిలిచారు. నాకు మూలస్తంభాలుగా ఉన్నారు. అందుకే ఎవరైనా ఏదైనా సాధించాలంటే సరైన మార్గదర్శకత్వం, వారి చుట్టూ సహనం ఉన్న మంచి వ్యక్తులు ఉండాలి.