తెలంగాణ

telangana

ETV Bharat / sports

5 వేల పరుగులు, 100 వికెట్లు - టీ20లో తొలి భారత క్రికెటర్‌గా హార్దిక్ పాండ్య రికార్డు!

టీ20ల్లో హార్దిక్ అరుదైన రికార్డు - ఆ ఫీట్ సాధించిన ఏకైగా భారత ఆల్‌రౌండర్​గా!

Hardik Pandya Syed Mushtaq Ali Trophy
Hardik Pandya (Getty Images)

By ETV Bharat Sports Team

Published : 4 hours ago

Hardik Pandya Syed Mushtaq Ali Trophy : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య తాజాగా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 5 వేల పరుగులు, 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా బరోడా తరఫున ఆడుతున్న పాండ్య, గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రేర్​ ఫీట్ సాధించాడు.

ఇక ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు స్కోర్ చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని బరోడా ఐదు వికెట్లు కోల్పోయి మూడు బంతులు మిగిలుండగానే చేధించింది. ఇక ఐదో స్థానంలో బరిలోకి దిగిన హార్దిక్ (74*) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి జట్టును గెలిపించాడు. అంతేకాకుండా టాప్​ స్కోరర్​గానూ నిలిచాడు. మరోవైపు హార్దిక్​తో పాటు శివాలిక్ శర్మ (64) కూడా రాణించాడు. బ్యాటింగ్​తో పాటు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన హార్దిక్ ఒక వికెట్ కూడా పడగొట్టాడు.

టీ20 క్రికెట్‌లో 5 వేల పరుగులు, 100 వికెట్లు పడగొట్టిన భారత ఆటగాళ్లు వీళ్లే :

  1. హార్దిక్ పాండ్య- (5,067 పరుగులు, 180 వికెట్లు)
  2. రవీంద్ర జడేజా - (3,684 పరుగులు, 225 వికెట్లు)
  3. అక్షర్ పటేల్ -(2,960 పరుగులు, 227 వికెట్లు)
  4. కృనాల్ పాండ్య- (2,712 పరుగులు, 138 వికెట్లు)
  5. ఇర్ఫాన్ పఠాన్‌ - (2,020 పరుగులు, 173 వికెట్లు)

గుజరాత్ తుది జట్టు : అక్షర్ పటేల్ (కెప్టెన్), సౌరవ్ చౌహాన్, రవి బిష్ణోయ్, ఉర్విల్ పటేల్ (వికెట్ కీపర్), రిపాల్ పటేల్, ఆర్య దేశాయ్, ఉమంగ్ కుమార్, హేమంగ్ పటేల్, తేజస్ పటేల్, చింతన్ గజా, అర్జన్ నగవస్వాల్లా.

బరోడా తుది జట్టు :కృనాల్‌ పాండ్య (కెప్టెన్), హార్దిక్ పాండ్య, భాను పానియా,మితేశ్​ పటేల్ (వికెట్ కీపర్), విష్ణు సోలంకి, నినాద్ అశ్విన్‌కుమార్ రథ్వా, అహిత్ షేత్, మహేశ్​ పిథియా, శివాలిక్ శర్మ, లుక్మాన్ మేరీవాలా, రాజ్ లింబాని.

'మేం కష్టాల్లో ఉన్నప్పుడు, బాగా ఒత్తిడికి గురయ్యా - కోహ్లీ, హార్దిక్ కాపాడారు' - రోహిత్

ABOUT THE AUTHOR

...view details