తెలంగాణ

telangana

ETV Bharat / sports

మ్యాక్సీ 'ఓవర్​రేటడ్'​ - మాజీ క్రికెటర్​కు తప్పని ట్రోల్ సెగ - Glenn Maxwell RCB - GLENN MAXWELL RCB

Glenn Maxwell RCB : ఆర్సీబీ స్టార్ క్రికెటర్ గ్లెన్​ మ్యాక్స్​వెల్​పై కామెంట్​ చేసినందుకు మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్​ను మ్యాక్సీ ఫ్యాన్స్​ను ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Glenn Maxwell RCB
Glenn Maxwell RCB (Source : ANI)

By ETV Bharat Telugu Team

Published : May 5, 2024, 12:56 PM IST

Glenn Maxwell RCB : ఐపీఎల్​ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియన్ బ్యాట్స్​మెన్స్​ గ్లెన్ మ్యాక్స్​వెల్​ గత కొంత కాలంగా పేలవ ఫామ్​ కనబరుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టు అద్భుత విజయం సాధించినప్పటికీ మ్యాక్సీ ఆ మ్యాచ్​లోనూ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. దీంతో అతడి ఆటతీరును విమర్శిస్తూ టీమ్ఇండియా మాజీ క్రికెటర్ పార్థివ్‌ పటేల్ కామెంట్స్​ చేశాడు. "ఐపీఎల్‌ చరిత్రలో ఓవర్‌రేటెడ్‌ ప్లేయర్‌ గ్లెన్ మ్యాక్సీ" అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్​లు పెట్టాడు.

ఇక ఈ పోస్ట్ నెట్టింట ట్రెండ్ అవ్వగా, మ్యాక్సీ ఫ్యాన్స్ పార్థివ్​ను ట్రోల్​ చేయడం ప్రారంభించారు. నెట్టింట అతడి గురించి మీమ్స్ వేయడం మొదలెట్టారు. ఇందులో భాగంగా ఓ అభిమాని బాడీ షేమింగ్‌ కామెంట్‌ పెట్టాడు. "ఎవరైతే 5 అడుగుల 2 అంగుళాల కంటే తక్కువ ఉంటారో, ఆ వ్యక్తి అభిప్రాయాలను పట్టించుకోరు" అంటూ పోస్టు చేశాడు. దీనిపై పార్థివ్‌ పటేల్ కూడా ఘాటుగానే స్పందించాడు. "నేను 5"3. ఇప్పుడు నీకు ఓకేనా?" అంటూ రిప్లై ఇచ్చాడు.

మరో ఫ్యాన్స్ అయితే "అతడి (మ్యాక్సీ) ట్రోఫీలు నీకంటే ఎత్తు" అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై కూడా పార్థివ్‌ కామెంట్ చేశాడు. "ఇది కూడా ఒకసారి జరిగింది. ట్రోఫీ ఎప్పటికీ నాకంటే పెద్దదే" అంటూ చెప్పాడు.

ఇక ప్రస్తుత ఐపీఎల్​లో గ్లెన్ మ్యాక్స్​వెల్ పేలవంగా ఆడుతున్నాడు. ఈ సీజన్​లో అతడు ఆడిన 6 మ్యాచ్​ల్లో కేవలం 32 పరుగులు మాత్రమే నమోదు చేశాడు. అందులో ఏకంగా మూడుసార్లు పరుగుల ఖాతా తెరవకముందే పెవిలియన్ చేరాడు. అంతే కాకుండా ఈ క్రమంలో ఐపీఎల్​లో అత్యధిక డకౌట్​ల చెత్త రికార్డు కూడా మూటగట్టుకున్నాడు. తాజాగా జరిగిన మ్యాచ్​లోనూ ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్​ సోషల్ మీడియా వేదికగా అతడిని కామెంట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు అడినట్లుగా లీగ్ క్రికెట్​లో ఆడటం లేదంటూ విమర్శలు సైతం వస్తున్నాయి.

'నాకు బ్రేక్ కావాలి'- కెప్టెన్​కు మ్యాక్సీ రిక్వెస్ట్!- షాక్​లో RCB ఫ్యాన్స్​ - Maxwell IPL 2024

విరాట్ దెబ్బకు షారుక్​ ఒక్కసారిగా షాకయ్యాడుగా! - IPL 2024

ABOUT THE AUTHOR

...view details