Gautam Gambhir About Virat Kohli :క్రికెట్‌లో ప్లేయర్‌ల మధ్య వాగ్వాదాలు, కవ్వింపు చర్యలు సహజమే. సాధారణంగా ఈ గొడవలు వేర్వేరు దేశాలకు చెందిన ఆటగాళ్ల మధ్య ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ఇందుకు భిన్నంగా గౌతమ గంభీర్, కోహ్లి మధ్య వాగ్వాదాలు జరిగాయి. ఇద్దరూ తమ టీమ్‌లను గెలిపించేందుకు ఎంత కసిగా ఉంటారు, కోహ్లితో తనకున్న రిలేషన్‌పై తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గంభీర్ మాట్లాడాడు.
ఇటీవల బెంగళూరులో ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ స్ట్రాటెజిక్ టౌమ్ అవుట్‌లో కోహ్లి, గంభీర్ కలిశారు. ఇద్దరూ హగ్ చేసుకున్న వీడియో వైరల్ అయ్యింది. దీనిపై కోహ్లి ఒక ప్రమోషనల్ ఈవెంట్‌లో మాట్లాడుతూ, మా మధ్య వాగ్వాదం జరగకపోవడం చాలా మందిని నిరాశపరిచిందని ఫన్నీగా కామెంట్ చేశాడు.
"విరాట్ చెప్పిన దాన్ని అంగీకరిస్తున్నా. ఇద్దరు వ్యక్తులు తగినంత మెచ్యూర్‌గా ఉన్నప్పుడు, వారి మధ్య జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదు. ప్రజల లైఫ్ లేదా రిలేషన్ అది వారిద్దరికి సంబంధించింది. ఇదంతా టీఆర్‌పీ కోసమే. మీడియాకు నేను ఎలాంటి వ్యక్తిని, విరాట్ ఎలాంటి వ్యక్తి అని ఎలాంటి క్లూ లేదు. మీడియా కేవలం హైప్‌ని క్రియేట్ చేయడంపై దృష్టి పెడుతుంది. కానీ హైప్‌ని కూడా పాజిటివ్‌గా క్రియేట్ చేయవచ్చు.’ అని చెప్పాడు. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్‌కి ముందు ప్రాక్టీస్ సెషన్‌లో కూడా కోహ్లి, గంభీర్ మాట్లాడుతూ కనిపించారు.
"నేను కోరుకున్నప్పటికీ, ఒక్క డ్యాన్స్ స్టెప్ కూడా వేయలేను. నేను విరాట్ నుంచి ఏదైనా నేర్చుకోవాలంటే, అది అతని డ్యాన్స్ మూవ్స్" అని గంభీర్ తెలిపాడు.