Cricketers In ODI After 30 : ఏ దేశమైనా యంగ్ క్రికెట్ ప్లేయర్స్‌ని భవిష్యత్తుగా భావిస్తుంది. వారికి ఎక్కువ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తుంది. చాలా కాలంగా డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్న సీనియర్లను పక్కనపెడుతుంది. వారి వయసు వారిని అంతర్జాతీయ క్రికెట్‌కి దూరం చేస్తుంది. అయితే ప్రతిభ, సంకల్పం విషయంలో వయసుతో సంబంధం లేదని చరిత్ర చెబుతోంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి, అద్భుతంగా రాణించిన ప్లేయర్‌లు ఉన్నారు. అలాంటి టాప్ ఫైవ్ క్రికెటర్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ (33) జర్నీ చాలా ప్రత్యేకం. డొమెస్టిక్ క్రికెట్, ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ, అతనికి జాతీయ జట్టు నుంచి పిలుపు రాలేదు. 2018 నుంచి 2020 వరకు ఐపీఎల్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. దీంతో 2021లో చివరికి భారత టీ20 జట్టులో చోటు దక్కింది. ఇప్పుడు అతను T20Iలలో 165 స్ట్రైక్ రేట్‌తో 39 యావరేజ్‌తో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.
మైఖేల్ హస్సీ
'మిస్టర్ క్రికెట్'గా గుర్తింపు పొందిన మైఖేల్ హస్సీ చాలా ఆలస్యంగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 30 సంవత్సరాల వయస్సులో ఆస్ట్రేలియా తరఫున అవకాశం అందుకున్నాడు. కెరీర్‌లో కెరీర్ 79 టెస్ట్ మ్యాచ్‌లు, 185 వన్డేలు ఆడాడు. మొత్తం 12,000 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లోనూ అదరగొట్టాడు. 2013లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
సయీద్ అజ్మల్
సయీద్ అజ్మల్ 31 సంవత్సరాల వయస్సులో పాకిస్థాన్ తరఫున అరంగేట్రం చేశాడు. అప్పటికి చాలా మంది బౌలర్ల కెరీర్ ముగింపు దశకు చేరుకుంది. అతడి ఆఫ్ స్పిన్ బౌలింగ్, వేరియేషన్లను ఎదుర్కోవడం బ్యాటర్లకు సవాలుగా మారింది.