Cricketers Lost Fathers During Tournment:పాకిస్థాన్ మహిళల టీ20 జట్టు కెప్టెన్ ఫాతిమా సనా ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తండ్రి అక్టోబరు 10న గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు. దీంతో ఆమె మహిళల టీ20 వరల్డ్ కప్ టోర్నీ నుంచి మధ్యలోనే వైదొలిగింది. దుబాయ్ నుంచి స్వదేశానికి వెళ్లింది. అక్టోబరు 11, 14న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మునీబా అలీ పాక్ తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించనున్నారు. ఈ క్రమంలో క్రికెట్ టోర్నమెంట్ల సమయంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం.
రషీద్ ఖాన్
అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ తండ్రి హాజీ ఖలీల్ 2018 డిసెంబర్లో కన్నుమూశారు. ఆ సమయంలో రషీద్ ఆస్ట్రేలియా డొమెస్టిక్ టోర్నీ బిగ్ బాష్ లీగ్లో ఆడుతున్నాడు. అయితే రషీద్ తన తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేదు. కుటుంబ సభ్యుల మద్దతుతో, తండ్రి మరణించిన మరుసటి రోజే అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున మైదానంలోకి దిగాడు. సిడ్నీ థండర్పై అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఆ మ్యాచ్లో రెండు వికెట్లు పడగొట్టాడు.
మహ్మద్ సిరాజ్
2020 నవంబరులో టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు తన తండ్రి మహ్మద్ గౌస్ మరణించారు. ఈ వార్త సిరాజ్ను తీవ్రంగా కుదిపేసింది. అయినప్పటికీ దేశం తరఫున ఆడాలన్న కసితో సిరాజ్ స్వస్థలం హైదరాబాద్కు రాలేదు. ఆ పర్యటనలోనే టెస్టు అరంగేట్రం చేసిన సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టి తండ్రికి ఘనమైన నివాళిని అర్పించాడు.