Teamindia Head Coach Gautam Gambhir :రాహుల్ ద్రవిడ్ వారసుడు ఎవరో తేలిపోయింది. నెల రోజులుగా వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఎట్టకేలకు గౌతమ్ గంభీర్‌ని టీమ్ ఇండియా కొత్త హెడ్ కోచ్‌గా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఎక్స్ (ట్విటర్) ద్వారా ప్రకటించారు. గంభీర్ అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని జై షా పేర్కొన్నారు. కాగా, గత నెలలో కోచ్ పదవికి అప్లై చేసుకున్న భారత మాజీ ఓపెనర్లు గంభీర్, WV రామన్‌ను బీసీసీఐ, క్రికెట్ సలహా కమిటీ (CAC) ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.
"భారత క్రికెట్ జట్టు కొత్త ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను నేను స్వాగతిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆధునిక క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందింది. గౌతమ్ ఈ మార్పులను దగ్గరగా చూశాడు. తన కెరీర్‌లో వివిధ పాత్రల్లో రాణించి, కష్టాలను తట్టుకుని నిలిచాడు గంభీర్. భారత క్రికెట్‌ను ముందుకు నడిపించడానికి గౌతమ్ ఆదర్శవంతమైన వ్యక్తి అని నాకు నమ్మకం ఉంది. టీమ్ ఇండియాపై అతని స్పష్టమైన దృష్టి, అతని విస్తారమైన అనుభవం, ఈ ఉత్తేజకరమైన కోచింగ్ పాత్రకు పరిపూర్ణం చేస్తాయి. అతనికి ఈ కొత్త ప్రయాణంలో బీసీసీ పూర్తిగా సపోర్ట్ చేస్తుంది." అని అన్నారు.
- శ్రీలంక సిరీస్‌లో జట్టుతో చేరనున్న గంభీర్
ఈ నెలలో శ్రీలంకతో జరిగే వైట్ బాల్ సిరీస్ నుంచి భారత్‌కు కొత్త ప్రధాన కోచ్‌ను నియమిస్తామని బీసీసీఐ కార్యదర్శి షా గతంలోనే ధృవీకరించారు. కాబట్టి గంభీర్ సారథ్యంలోనే భారత్ శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. సహాయక కోచ్‌ల ఎంపిక విషయంలో కూడా బీసీసీఐ గంభీర్‌కు పూర్తిస్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది.
జులై 27 నుంచి శ్రీలంకలో భారత్ 3 టీ20లు, 3 వన్డేలు ఆడుతుంది. ప్రస్తుతం జరుగుతున్న జింబాబ్వే టీ20 సిరీస్‌కు ఎన్‌సీఏ అధిపతి, వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సిరీస్ పూర్తయ్యాక గంభీర్ పగ్గాలు అందుకుంటాడు. - గర్వంగా ఉంది -