Cricketers Love Stories:వాలెంటైన్స్ డే లవ్ బర్డ్స్‌కు ఎంతో స్పెషల్. వారం రోజుల పాటు ఈ వాలంటైన్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటారు ప్రేమికులు. ఈ స్పెషల్ రోజున చాలా మంది తమ పార్ట్నర్కు డిఫరెంట్ స్టైల్లో ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేస్తుంటారు. దీనికి సినిమా హీరోలు, క్రికెటర్లు, సెలబ్రిటీలు ఎవరూ అతీతం కాదు. అయితే టీమ్ఇండియా స్టార్లు కెప్టెన్ రోహిత్ శర్మ సహా, విరాట్ కోహ్లీ , ధోనీ ఇలా అనేక మంది క్రికెటర్లు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమకు క్లీన్ బౌల్డ్ అయిన క్రికెటర్లు ఎవరంటే?
సచిన్ తెందూల్కర్- అంజలి:మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ది ప్రేమ వివాహామే. 1990లో అంజలితో పరిచయం ఏర్పడిన సచిన్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత 1995లో వీరు వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరికి సారా, అర్జున్ తెందూల్కర్ ఇద్దరు పిల్లలున్నారు. కాగా, అర్జున్ తెందూల్కర్ పలు డొమెస్టిక్ టోర్నమెంట్‌ల్లో రాణిస్తున్నాడు.
గంగూలీ- డోనా: టీమ్ఇండియా మాజీ ప్లేయర్ సౌరభ్ గంగూలీ తన ప్రియురాలు డోనా గంగూలీని 1997లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.
దినేష్ కార్తీక్- దీపిక:దినేష్ కార్తీక్ తన ప్రియురాలు దీపికతో ప్రేమలో మునిగితేలాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. 2013లో మారథాన్‌లో తొలిసారి కలుసుకున్న వీరి ప్రేమకథ వెరైటీగా స్టార్ట్ అయ్యిందంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
మహేంద్రసింగ్ ధోనీ-సాక్షి మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తన చిన్ననాటి స్నేహితురాలు సాక్షిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఒక పాప (జీవా సింగ్) పుట్టింది.
రోహిత్ శర్మ- రితికా: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతడి పర్సనల్ మేనేజర్ రితికా సజ్దేతో కొన్నేళ్లు లవ్ ట్రాక్ నడిపాడు రోహిత్. ఇక ఇరు కుటుంబాలను ఒప్పించిన ఈ జంట 2015 డిసెంబర్లో మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది. ఈ జంట 2018లో సమైరా అనే పాప జన్మించింది.