Cricketers Debut With Kohli But Faded Away : క్రికెట్‌లో సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం, అదృష్టం కొందరికే ఉంటుంది. జాతీయ జట్టులో చోటు సంపాదించడానికి ఎంతో కష్టపడతారు. కొందరు అంచనాలకు మించి రాణిస్తే, ఇంకొందరు ఊహించని రీతిలో కనుమరుగవుతారు. 2008లో విరాట్ కోహ్లీ అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. క్రికెట్ ప్రపంచంలో కోహ్లీ అందనంత ఎత్తుకు ఎదుగుతాడని చాలా మంది ఊహించి ఉండరు.
క్రికెట్‌లో కోహ్లీ చాలా త్వరగా గుర్తింపు పొందాడు. అతడి తరంలోని గొప్ప క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు. అయితే కోహ్లీతో పాటు వన్డే కెరీర్ ప్రారంభించిన మరో ఇద్దరి ప్రయాణం మాత్రం ఆశించినంత విజయవంతం కాలేదు. వాళ్లు ఎవరంటే?
ఆల్రౌండర్ అభిషేక్ నాయర్
1983లో సికింద్రాబాద్‌లో జన్మించాడు ఆల్రౌండర్ అభిషేక్ నాయర్. బ్యాటింగ్, మీడియం-పేస్ బౌలింగ్ చేయగలడు. మొదట ముంబయి తరఫున డొమెస్టిక్ క్రికెట్‌లో రాణించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నాడు. దీంతో భారత జాతీయ జట్టులో అవకాశం లభించింది. 2009లో నాయర్ అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అయితే అతడి కెరీర్ చాలా తక్కువ కాలంలోనే ముగిసింది. జాతీయ జట్టులో కేవలం మూడు వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం వచ్చింది.
అయినప్పటికీ, డొమెస్టిక్ క్రికెట్‌లో నాయర్ కీలక ప్లేయర్‌గా కొనసాగాడు. రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీ సహా 5 వేలకు పైగా పరుగులు సాధించాడు. అనంతరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రెగ్యులర్‌గా మారాడు. ముంబయి ఇండియన్స్ వంటి జట్లకు ఆడాడు. అనంతరం కోచ్‌గా కొత్త జర్నీ ప్రారంభించాడు. భారత జట్టుతో కలిసి పని చేస్తున్నాడు.