Cricketers Ayodhya Invitation : యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అపురూప ఘట్టం మరి కొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. జనవరి 22న బాల రాముడి ప్రాణపత్రిష్ఠాపన మహోత్సవానికి అయోధ్య నగరం సిద్ధమవుతోంది. ఇప్పటికే అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానం అందింది.
క్రికెటర్స్‌లో ఎవరంటే? ఇందులో భాగంగానే క్రికెట్‌కు సంబంధించి కూడా పలువురు దిగ్గజాలకూ ఈ ఆహ్వానం అందింది. వీరిలో దిగ్గజ క్రికెటర్, భారతరత్న అవార్డు గ్రహీత సచిన్ తెందుల్కర్, టీమ్ఇండియా మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, ఎంఎస్ ధోనీ, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీలు ఉన్నారు. ఇంకా వీరితో పాటు టీమ్ఇండియా మాజీ ప్లేయర్స్ గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా అయోధ్యను సందర్శించనున్నారు.
ఇక భారత మహిళల క్రికెట్లో మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో పాటు ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌లకు ఈ ఆహ్వానం అందినట్లు తెలిసింది. మొత్తంగా ఆహ్వానం అందిన వారిలో దాదాపుగా ప్రతిఒక్కరూ కుటుంబసమేతంగా అయోధ్యకు వెళ్లే అవకాశం ఉంది.