David Warner Pushpa 2 :భారత్‌లో సినిమా, క్రికెట్‌కి భారీ క్రేజ్ ఉంది. ఈ రెండు రంగాలకు చెందిన సెలబ్రిటీలకు ఫ్యాన్ ఫ్యాలోయింగ్ కూడా ఎక్కువే. మరి మైదానంలో సిక్సర్లు కొట్టే స్టార్ క్రికెటర్ సిల్వర్ స్క్రీన్‌పై స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుంది? అభిమానులకు డబుల్ ధమాకానే. అయితే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ బిగ్ స్క్రీన్‌పై కనిపించనున్నాడా? అంటే ఔననే అంటున్నారు నెటిజన్లు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప పార్ట్ 1'లోని 'శ్రీవల్లి' పాట గతంలో ఇండియా మొత్తం సూపర్ హిట్ అయ్యింది. ఈ పాటకు వార్నర్ రీల్స్ కూడా అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌గా మారాయి. అలాగే మైదానంలోనూ పలుమార్లు 'తగ్గేదేలే' అంటూ బన్నీ మేజనరిజాన్ని అనుసరించిన వార్నర్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అయితే ఈ క్రేజ్‌ని 'పుష్ప 2' లో వినియోగించుకోవాలని డైరెక్టర్ సుకుమార్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే 'పుష్ప 2' లో డేవిడ్ వార్నర్‌ని చూడవచ్చు!
కీ రోల్లో వార్నర్?
'పుష్ప 2' లో వార్నర్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. డేవిడ్ వార్నర్‌కి సంబంధించిన ఓ స్టిల్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో వార్నర్ చూట్టు ప్రొఫెషనల్ బౌన్సర్లు ఉన్నారు. వైట్ అండ్ వైట్ ఔట్ ఫిట్‌లో వార్నర్ గన్ పట్టుకొని స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. అయితే ఈ లుక్ పుష్ప సినిమాలోనిదే అని నెటిజన్లు అంటున్నారు. కానీ, ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. పుష్ప మేకర్స్ నుంచి కూడా దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు.
అలా తెలుగు ప్రేక్షకులకు దగ్గర
అయితే వార్నర్ - తెలుగు ప్రజల మధ్య మంచి బాండింగ్ ఉంది. వార్నర్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ప్రాతినిధ్యం వహించాడు. వార్నర్‌కి తెలుగు అభిమానులు చాలా సపోర్ట్ చేశారు. ఈ ప్రేమతో వార్నర్ అప్పుడప్పుడు తెలుగు సాంగ్స్‌కి డ్యాన్స్ చేస్తు, సినిమా డైలాగులు చెబుతూ రీల్స్ చేసేవాడు. ఇలా తెలుగువారికి మరింత దగ్గరయ్యాడు.