IND VS AUS 1st Test Ashwin Jadeja : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్ పెర్త్ వేదికగా మొదలైంది. అయితే ఈ మ్యాచ్ తుది జట్టు కూర్పులో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. టీమ్ ఇండియా ఇద్దరు స్ట్రైట్ స్పిన్నర్లు లేకుండానే బరిలోకి దిగింది. దీంతో దశాబ్ద కాలంగా భారత టెస్టు విజయాల్లో కీలకంగా వ్యవహరిస్తోన్న రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బెంచ్‌కే పరిమితమవ్వడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. అనుభవజ్ఞులైన ఇద్దరు ఆటగాళ్లను పక్కన పెట్టి, తక్కువ అనుభవం ఉన్న వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకుని పెద్ద సాహసమే చేసింది. అంటే ఏకైక స్పిన్నర్‌తో బరిలోకి దిగింది.
అయితే మ్యాచ్‌కు ముందు చాలా మంది, ఒకవేళ ఏకైక స్పిన్నర్‌ను తీసుకుంటే అది రవిచంద్రన్ అశ్విన్ అని అనుకున్నారు. కానీ మేనేజ్‌మెంట్ మాత్రం ఆఖరి నిమిషంలో సుందర్ వైపు మొగ్గు చూపి అందరినీ షాక్‌కు గురిచేసింది. ఎందుకంటే సుందర్ మెరుగ్గా బ్యాటింగ్ చేస్తాడన్న కారణంతో తీసుకుందని తెలుస్తోంది.
కొన్ని క్రికెట్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం జడ్డూ మ్యాచ్ కోసం ఫుల్ ఫిట్‌గా లేడని అంటున్నారు. ఇక అశ్విన్ విషయానికొస్తే అతడు విదేశీ పిచ్‌పై బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అదే సుందర విషయానికొస్తే అతడు మెరుగ్గా బ్యాటింగ్ చేస్తాడని మేనేజ్‌మెంట్ భావిస్తోందట.
ఇలా జరగడం ఐదో సారి - కాగా, 2012 నుంచి అశ్విన్-జడేజా లేకుండా భారత్ జట్టు టెస్టు ఆడటం ఇది ఐదోసారి మాత్రమే. అందులో నాలుగు సార్లు ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్‌లే ఉన్నాయి. మరో మ్యాచ్ దక్షిణాఫ్రికాతో ఆడింది. అయితే అశ్విన్-జడేజా లేకుండా టీమ్ ఇండియా ఆడిన గత నాలుగు మ్యాచుల్లో రెండింటిలో విజయాలు సాధించింది. 2018లో జొహెన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాపై, 2021లో బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. 2014లో అడిలైడ్ వేదికగా, 2018లో పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్‌లలో ఆస్ట్రేలియాపై ఓడింది. మొత్తంగా జడేజా - అశ్విన్ లేకుండానే మేనేజ్‌మెంట్ రచించిన ఈ వ్యూహం తాజా మ్యాచ్‌లో సక్సెస్ అవుతుందా లేదా బెడిసికొడుతుందా అన్నది చూడాలి.
ఇకపోతే ఈ మ్యాచ్‌లో నాలుగు పేస్ బౌలింగ్ ఆప్షన్స్‌తో బరిలోకి దిగింది భారత్. అందులో ఒకరు సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కాగా రెండో ఆటగాడు రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా. ఇంకా ఈ పెర్త్ పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలించనుండటం వల్ల భారత్ ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లు, ఓ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌తో బరిలోకి దిగింది.
ఆసీస్‌తో మొదలైన తొలి టెస్ట్ - గిల్ గాయంపై బీసీసీఐ అప్డేట్
బోర్డర్ గావస్కర్ ట్రోఫీ : లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ డీటెయిల్స్- ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?