BCCI Test Match Fee:టీమ్ఇండియా ఆటగాళ్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. పురుషులకు టెస్టు ఫార్మాట్ మ్యాచ్ ఫీజు పెంచనున్నట్లు బోర్డు సెక్రటరీ జై షా వెల్లడించారు. ఆటగాళ్ల ఆర్ధిక స్థిరత్వాన్ని దృఢపర్చేందుకు 'టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్' పేరిట అదనపు ఫీజు చెల్లించాలని బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు షా తెలిపారు. ఈ ఇన్సెంటివ్ స్కీంతో ఆయా ప్లేయర్‌కు అత్యధికంగా ఒక్కో మ్యాచ్‌కు రూ.45 లక్షల దాకా ఫీజు రూపంలో అందనుంది. ఇది 2022-23 సంవత్సరం నుంచే అమలైనట్లు షా పేర్కొన్నారు.
ఫీజు వివరాలు: ఒక సంవత్సర కాలంలో భారత్ 9 మ్యాచ్‌లు ఆడుతుందని అనుకుంటే, అందులో 4 టెస్టులకంటే తక్కువ ఆడిన ప్లేయర్లకు ఈ ఇన్సెంటివ్ వర్తించదు. 50 శాతం అంటే 5-6 మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్ రూ.30 లక్షలు అందుకుంటాడు. సిరీస్‌కు ఎంపికై తుది జట్టులో లేకపోయినా రూ.15 లక్షలు దక్కుతాయి. ఇక 7 అంతకంటే ఎక్కువ (75 శాతం) మ్యాచ్‌లు ఆడిన ఆటగాడికి బీసీసీఐ అత్యధికంగా రూ.45 లక్షలు చెల్లించనుంది. ఇందులో కూడా బెంచ్‌కు పరిమితమైనా రూ.22.50 లక్షలు అందుకుంటారు. కాగా, ప్రస్తుతం ఒక్కో టెస్టు మ్యాచ్‌కు బేసిక్ ఫీజు రూ.15 లక్షలు ఉంది.
BCCI Annual Contract: 2023-24వ ఏడాదికిగానూ బీసీసీఐ ఇటీవల టీమ్ఇండియా వార్షిక ఆటగాళ్ల కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. ఇందులో భాగంగా గ్రేడ్ ఏ ప్లస్, ఏ, బీ, సీలోకి ఆయా ప్లేయర్ల కాంట్రాక్ట్‌లను సవరించింది. కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాను A+ గ్రేడ్‌లో చేర్చగా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా A గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు.