తెలంగాణ

telangana

ETV Bharat / sports

డక్‌వర్త్‌ పద్ధతిలో ఆసీస్​ విజయం - కమిన్స్​ 'హ్యాట్రిక్' ఘనత - AUSTRALIA T20 WORLD CUP 2024 - AUSTRALIA T20 WORLD CUP 2024

BAN Vs AUS T20 WORLD CUP 2024 : టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా బంగ్లదేశ్​తో జరిగిన సూపర్ 8 మ్యాచ్​లో ఆస్ట్రేలియా జట్టు సంచలన విజయం సాధించింది. హోరా హోరీగా జరిగిన ఈ పోరులో 28 పరుగులు తేడాతో కివీస్ టీమ్​ గెలుపొందింది. అయితే ఇదే వేదికగా స్టార్‌ పేసర్ పాట్ కమిన్స్ ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు.

BAN Vs AUS T20 WORLD CUP 2024
BAN Vs AUS T20 WORLD CUP 2024 (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jun 21, 2024, 10:51 AM IST

Updated : Jun 21, 2024, 11:03 AM IST

BAN Vs AUS T20 WORLD CUP 2024 :టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా బంగ్లదేశ్​తో జరిగిన సూపర్ 8 మ్యాచ్​లో ఆస్ట్రేలియా జట్టు సంచలన విజయం సాధించింది. హోరా హోరీగా జరిగిన ఈ పోరులో 28 పరుగులు తేడాతో కివీస్ టీమ్​ గెలుపొందింది.

మ్యాచ్ సాగిందిలా :
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు స్కోర్ చేయగలిగింది. ఆ జట్టు కెప్టెన్ షాంటో (41), తౌహిద్ (40) మాత్రమే రాణించారు. మిగతావారందరూ తమ పేలవ ఫామ్​ వల్ల జట్టు అంతంతమాత్రమే స్కోర్ చేయగలిగింది. ఇక ఆసీస్​ జట్టులో కమిన్స్‌తోపాటు (3/29) ఆడమ్ జంపా (2/24) తమ బౌలింగ్​ స్కిల్స్​తో ఆకట్టుకున్నారు. మ్యాక్స్‌వెల్, స్టాయినిస్, మిచెల్ స్టార్క్ తలో వికెట్ పడగొట్టారు.

బంగ్లా నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆసీస్​ జట్టుకు కాసేపటి వరకు ఆడినప్పటికీ, వరుణుడు అంతరాయం కలిగించటం వల్ల ఆటకు బ్రేక్ పడింది. దీంతో ఆసీస్‌ను విజేతగా ప్రకటిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. డక్‌వర్త్‌ లూయిస్ పద్ధతి ప్రకారం ఆసీస్‌ 28 పరుగుల తేడాతో బంగ్లాపై విజయాన్ని చేజిక్కిచుకుంది.

కమిన్స్ హ్యాట్రిక్​ - మొత్తాని ఇది ఏడోది
అయితే ఇదే వేదికగా స్టార్‌ పేసర్ పాట్ కమిన్స్ ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు. తాజాగా సూపర్-8 పోరులో బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్‌ వికెట్లు తీసి రికార్డుకెక్కాడు. వరుస బంతుల్లో బంగ్లా బ్యాటర్లు మహమ్మదుల్లా, మహెది హసన్, తౌహిద్ హృదోయ్‌ను వరుసగా ఔట్ చేశాడు. అలా ప్రస్తుత ప్రపంచకప్​ టోర్నీలో తొలి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. అయితే ఓవరాల్‌గా ఇది ఏడోది కావడం విశేషం.

ఇదే కాకుండా ఆసీస్‌ తరఫున హ్యాట్రిక్‌ తీసిన రెండో బౌలర్‌గానూ కమిన్స్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2007లో బంగ్లాపైనే బ్రెట్‌లీ హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. ఐర్లాండ్‌ బౌలర్ కర్టిస్ క్యాంఫర్ (2021), శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ (2021), సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడ (2021), యూఏఈ బౌలర్ కార్తిక్ మైయప్పన్ (2022), ఐర్లాండ్‌ ఫాస్ట్‌ బౌలర్ జోష్ లిటిల్ (2022) ఈ జాబితాలో ఉన్నారు.

నాలుగు ఓవర్లలో 7 పరుగులు - ఇంటర్నేషనల్​ మ్యాచుల్లో బుమ్రా నయా రికార్డు - T20 World Cup 2024

అతడు ప్రతిసారీ అంతే- ఓ తలనొప్పిగా మారాడు!

Last Updated : Jun 21, 2024, 11:03 AM IST

ABOUT THE AUTHOR

...view details