Bail Change Review:వెస్టిండీస్ క్రికెటర్లు ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆటతోనే కాకుండా కామెడీ టైమింగ్‌తో చేసే పనులు గ్రౌండ్లో ప్లేయర్లతోపాటు ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విండీస్, ఆతిథ్య జట్టుతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడుతోంది. గబ్బా వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో విండీస్ ప్లేయర్ చేసిన పని నవ్వులు పూయిస్తోంది. ఇంతకీ అతడు ఏం చేశాడంటే?
మ్యాచ్ మధ్యలో సెషన్స్ బ్రేక్‌లో విండీస్ ప్లేయర్లంతా గ్రూప్‌గా చేరి గేమ్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో టెక్నీషియన్ ఒకరు గ్రౌండ్లోకి వచ్చి స్టంప్స్ అండ్ బెయిల్ (Stumps & Bail)ను అడ్జెస్ట్ చేస్తుండగా విండీస్ ఆల్‌రౌండర్ కేవమ్ హోడ్జ్ ఆమె వద్దకు వెళ్లాడు. 'టీవీ అంపైర్ టు డైరెక్టర్. వి హావ్ రివ్యూ ఫర్ బెయిల్ ఛేంజ్ (బెయిల్ మార్పునకు రివ్యూ కోరుతున్నాం). మాకు మంచి బెయిల్ ఇవ్వండి' అని హోడ్జ్ అన్నాడు. ప్లేయర్లు రివ్యూ కోరినప్పుడు ఫీల్డ్ అంపైర్, థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేసే విధంగా హోడ్డ్ మాట్లాడడం నవ్వులు పూయించింది. హోడ్జ్ మాటలు స్టంప్స్‌లో ఉన్న మైక్‌లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.