Anil Kumble IPL :తన అద్భుతమైన ఆట తీరుతో టీమ్ఇండియాకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు స్టార్ క్రికెటర్ అనిల్ కుంబ్లే. టీమ్ఇండియాకు ఎన్నో సూపర్ ఇన్నింగ్స్ ఇచ్చిన ఈ మాజీ క్రికెటర్ ఐపీఎల్‌లోనూ రాణించారు. 2008లో జరిగిన తొలి సీజన్‌లో ఈయన్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు దక్కించుకుంది. అప్పటి నుంచి ఆయన మూడేళ్ల పాటు అదే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించాడు.
అయితే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చన ఐపీఎల్ రోజులను గుర్తుచేసుకున్నారు. 2009 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమికి గల కారణాలను వెల్లడించారు.
రెండో సీజన్‌లో ఆర్సీబీకి కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాక కుంబ్లే అటు సారథిగానే కాకుండా స్పిన్నర్‌గానూ జట్టుకు పలు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక రెండో సీజన్ ఫైనల్స్ వరకు వచ్చిన ఆర్సీబీ తమ తుది మ్యాచ్‌ను డెక్కన్ ఛార్జర్స్‌తో తలపడింది. ఇక పోటాపోటీగా జరిగిన ఈ పోరులో ఎప్పటిలాగే కుంబ్లే రాణించారు. నాలుగు ఓవర్లలో కేవలం 16 పరుగులే ఇచ్చి నాలుగు కీలక వికెట్లను పడగొట్టాడు.దీంతో డెక్కన్ ఛార్జర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 143 పరుగులు చేయగలిగింది.
ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన ఆర్సీబీ జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 137 పరుగులనే తమ ఖాతాలో వేసుకుంది. ఎంతో ఉత్కంఠగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఛేజింగ్ ఆఖరిలో ఆ జట్టు రాబిన్ ఊతప్ప చేసిన ఓ తప్పిదం వల్ల జట్టు ఓటమిపాలైందని పేర్కొన్నారు.
''2009 ఫైనల్ రోజు జరిగిన ఘటనలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఎన్నో అవకాశాలను మేము చేజార్చుకున్నాం. వైడ్స్, నోబాల్స్ కూడా వేశాం. ప్రవీణ్ కుమార్ 5 వైడ్స్ వేశాడు. అయినప్పటికీ 143 పరుగులను మేం చేధించే అవకాశం ఉంది. ఆఖరి ఓవర్ ఆర్పీ సింగ్ బౌలింగ్ చేశాడు. ఎదుర్కొన్న తొలి బంతిని ఉతప్ప స్పూప్‌కు ప్రయత్నించాడు. ఆ సమయంలో స్కూప్ షాట్ ఆడొద్దని ఉతప్పను వేడుకున్నాను. 'ఉతప్ప, నువ్వు స్కూప్ ఆడేలా ఆర్పీ అవకాశం ఇవ్వడు. స్లాగ్ షాట్ ఆడేలా ట్రై చేయి' అంటూ చెప్పాను. కానీ మూడో బంతికి కూడా అతడు అలానే చేశాడు. ఇక చాలు అని నేను చెప్పాను. నాకు స్ట్రైకింగ్ ఇవ్వమని అన్నాను. నేనైనా స్లాగ్ చేస్తే ఏదైనా జరగొచ్చని అనుకున్నాను. కానీ మేం కేవలం ఆరు పరుగుల తేడాతో ఓటమిని చవి చూశాం.'' అంటూ కుంబ్లే ఆనాలి ఘటనలు గుర్తుచేసుకున్నాడు.
Ind vs Pak Top 5 Wicket Takers : ఇండోపాక్ మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్ల వీరులు వీళ్లే.. లిస్ట్‌లో కుంబ్లే ప్లేస్ ఎంతంటే
'అందుకే కోహ్లీకి అనిల్ కుంబ్లే నచ్చలేదు'