Akash Deep Sixes With Virat Bat :బంగ్లాతో జరుగుతున్న టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ 285/9 స్కోర్ వద్ద డిక్లేర్డ్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాపై 52 పరుగుల ఆధిక్యం సాధించింది. అయితే ఈ ఇన్నింగ్స్‌లో యంగ్ పేసర్ ఆకాశ్ దీప్ కళ్లు చేదిరే సిక్స్‌లతో ఆకట్టుకున్నాడు. షకిబ్ అల్ హసన్ వేసిన 34వ ఓవర్లో ఆకాశ్ ఎదుర్కొన్న రెండో, మూడో బంతిని స్టాండ్స్‌లోకి పంపి ఆశ్చర్యపరిచాడు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొన్న కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా చప్పట్లు కొడుతూ ఆకాశ్‌ను ప్రోత్సహించారు.
ఈ ఇన్నింగ్స్‌లో ఆకాశ్ వాడిన బ్యాట్‌కు ప్రముఖ కంపెనీ ఎమ్ఆర్ఎఫ్ (MRF) స్టిక్కర్ ఉంది. సాధారణంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాట్‌కు కూడా MRF కంపెనీయే స్పాన్సర్. అయితే విరాట్ రీసెంట్గా ఆకాశ్‌కు ఓ బ్యాట్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీన్ని ఆకాశ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తాజాగా ఆకాశ్ ఆ బ్యాట్‌తోనే రెండు సిక్సర్లు బాదాడంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇందులో నిజం ఎంతంటే?
అది విరాట్ బ్యాటేనా?
ఇటీవల విరాట్ కోహ్లీ తన బ్యాట్‌ను ఆకాశ్ దీప్‌కు బహుమతిగా ఇచ్చాడు. తాను విరాట్ నుంచి బ్యాట్ గిఫ్ట్‌గా అందుకున్నట్లు ఆకాశ్ దీప్ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడు. అయితే తాను అడగకుండానే విరాట్ బ్యాట్ ఇచ్చాడని ఆకాశ్ చెప్పాడు. ఆ బ్యాట్‌తో ఎప్పుడూ క్రికెట్ ఆడడని, దాన్ని విరాట్ గుర్తుగా ఉంచుకుంటానని ఆకాశ్ ఇప్పటికే ఓ సందర్భంలో తెలిపాడు.
'విరాట్ భయ్యా స్వయంగా నాకు బ్యాట్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. నా బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను విరాట్ గమనించాడు. అప్పుడే నాలో ఏదో గమనించిన ఆయన స్వయంగా నా దగ్గరకు వచ్చి 'బ్యాట్ కావాలా?' అని అడిగాడు. విరాట్ భయ్యా బ్యాట్ ఎవరు వద్దనుకుంటారు? నేను కూడా ఆయన బ్యాట్ కావాలనున్నా. అప్పుడే 'ఏ బ్యాట్‌తో ప్రాక్టీస్ చేస్తావు' అని నన్ను అడిగాడు. నేను నవ్వుతూ ఊరుకున్నా. వెంటనే విరాట్ భయ్యా 'ఇదిగో ఈ బ్యాట్ తీసుకో' అంటూ నాకు తన బ్యాట్ ఇచ్చాడు. ఆ బ్యాట్ విరాట్ భయ్యా నుంచి నాకు వచ్చిన పెద్ద బహుమతి. నేను ఎప్పటికీ ఆ బ్యాట్‌తో ఆడను. దాన్ని నా రూమ్‌లో ఓ గుర్తుగా గోడకు తగిలించుకుంటా' అని ఆకాశ్ ఇటీవల చెప్పాడు.
దీని బట్టి విరాట్ గిఫ్ట్‌గా ఇచ్చిన బ్యాట్‌తో కాకుండా మరో బ్యాట్‌తో ఆకాశ్ సోమవారం బరిలోకి దిగి ఉంటాడు. మరి అతడు ఏ బ్యాట్‌తో ఆడాడో ఆకాశ్ స్వయంగా వెల్లడించాల్సి ఉంది.